Tea : ఉదయాన్నే టీ , కాఫీలు తాగేవారికి ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం పడుతుందో తెలుసా ..??
Tea : చాలామంది ఉదయం లేవగానే టీ, కాఫీలు తాగేస్తుంటారు. టీ త్రాగనిది ఏ పని ప్రారంభించరు. అంతలా టీ, కాఫీలకు బానిసలు అయిపోయారు. చాలామంది టీ, కాఫీలు ఎనర్జీ డ్రింక్ అని అనుకుంటారు. ఉదయాన్నే వాటిని సేవించడం వలన తాము ఎనర్జీటిక్ గా ఉంటామని ఫీలవుతూ ఉంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. పరిగడుపున టీ కాఫీలు తాగటం వలన ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వలన కడుపులో ఆమ్లాలు పెరిగి జీర్ణ వ్యవస్థ పై చెడు ప్రభావం పడుతుంది. ఇది బరువు పెరగటానికి ప్రధాన కారణాలలో ఒకటి.
అలాగే ఉదయం లేవగానే టీ కాఫీలను సేవించడం వలన కడుపు లోపలి భాగం దెబ్బతింటుంది. దీంతో అల్సర్లకు దారితీస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వలన శరీరంలో చక్కెర కరిగిపోతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. ఊబకాయం వస్తుంది. ప్రతిరోజు కప్పుల కొద్ది టీ త్రాగటం వలన స్కెలిటల్ ఫ్లోరోసిస్ వంటి వ్యాధి వస్తుంది. దీనివలన ఎముకలు లోపల బోలుగా ఉంటాయి. ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. టీ త్రాగటం వలన తాజాదనం వస్తుందని అంటుంటారు. ఉదయాన్నే టీ తాగటం వలన అలసట చిరాకు కలుగుతాయి అన్నది నిజం. నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన కడుపులో గ్యాస్ ఏర్పడడంతోపాటు జీర్ణ క్రియ మందగిస్తుంది.
ఖాళీ కడుపుతో టీ తాగటం వలన పిత్త ప్రక్రియ నిరోధిస్తుంది. దీంతో వికారం, చంచలతను పెంచుతుంది. ఎక్కువగా టీ కాఫీలు తాగితే నిద్రలేమితో పాటు ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ఉదయాన్నే వేడి టీ తాగటం వలన శరీరంలో కెఫీన్ కరిగిపోతుంది. దీనివలన రక్త పోటు ప్రభావితం అయ్యి గుండె సమస్యలకు దారితీస్తుంది. అయితే ఉదయాన్నే టీ కాఫీలు తాగే అలవాటు ఉంటే ఖాళీ కడుపుతో టీ తాగే బదులు దాంతో పాటు బిస్కెట్ లేదా చిరుతిండ్లను తీసుకోవచ్చు.