Phone Effect : ఫోన్ అతిగే వాడే మగవారికి బ్యాడ్ న్యూస్.. సంతానంపై ఎఫెక్ట్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Phone Effect : ఫోన్ అతిగే వాడే మగవారికి బ్యాడ్ న్యూస్.. సంతానంపై ఎఫెక్ట్!

Phone Effect : స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగాక అమ్మాయిలు, అబ్బాయిలు దానికే అతుక్కుని పోతున్నారు. కొందరు తమ మొబైల్‌ను చదువుకోసం, జాబ్ కోసం వినియోగిస్తుంటే మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ టైం పాస్ చేస్తున్నారు. అయితే, ఏదైనా అతిగా వాడితే ముప్పు తప్పదంటూ తాజాగా సర్వేలు కుండబద్దలు కొట్టాయి. మగవారు అతిగా స్మార్ట్ ఫోన్ వాడుతుంటే భవిష్యత్తులో పెనుప్రమాదం తప్పదని నివేదికలు చెబుతున్నాయి. ఈ మధ్యకాలంలో పిల్లలు, వృద్ధులు కూడా స్మార్ట్ ఫోన్లకు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :29 January 2022,9:30 pm

Phone Effect : స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగాక అమ్మాయిలు, అబ్బాయిలు దానికే అతుక్కుని పోతున్నారు. కొందరు తమ మొబైల్‌ను చదువుకోసం, జాబ్ కోసం వినియోగిస్తుంటే మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ టైం పాస్ చేస్తున్నారు. అయితే, ఏదైనా అతిగా వాడితే ముప్పు తప్పదంటూ తాజాగా సర్వేలు కుండబద్దలు కొట్టాయి. మగవారు అతిగా స్మార్ట్ ఫోన్ వాడుతుంటే భవిష్యత్తులో పెనుప్రమాదం తప్పదని నివేదికలు చెబుతున్నాయి. ఈ మధ్యకాలంలో పిల్లలు, వృద్ధులు కూడా స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారిపోయారు. యవ్వనంలో ఉన్న వారు మాత్రం అతిగా మొబైల్ వాడితో దాని నుంచి విడుదలయ్యే రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్‌ల కారణంగా వీర్యం నాణ్యత క్రమంగా తగ్గిపోతుందని వెల్లడించారు. ఈరోజుల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్నారు.

కొందరు ఉద్యోగానికి సంబంధించిన వర్క్స్ కూడా మొబైల్ ద్వారానే చేస్తున్నారు. రాత్రంతా మేల్కొని ఫోన్ ఉపయోగిస్తున్న వారిపై కూడా రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ టైంలో మిగతా ఫోన్లు వినియోగం తగ్గి ఎక్కువగా రేడియేషన్ విడుదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. వీర్యంలోని శుక్రకణాలు ఎంత ఆరోగ్యంగా ఉంటే సంతానోత్పత్తికి ఎలాంటి ముప్పు ఉండదు. లేకపోతే సంతానం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని దక్షిణాకొరియా వైద్య నిపుణుల పరిశోధనలో తేలింది.నేషన్ల్ యూనివర్సిటీలోని అసిస్టెంట్ ఫ్రొఫెసర్ యున్ హక్ కిమ్ చేసిన పరిశోధనల్లో మొబైల్ అధికంగా వినియోగించే వారిలో శుక్రకణాల కౌంట్ తగ్గిందని పేర్కొన్నారు. వీరితో పోలిస్తే ఫోన్ తక్కువగా వినియోగించే వారి శుక్రకణాలు వేగంగా కదులుతున్నట్టు వెల్లడించారు.

bad news for men who overuse phone effect

bad news for men who overuse phone effect

Phone Effect : ప్రధానంగా 25 నుంచి 35 ఏళ్ల వారికి ముప్పు

RF-EMWలను మానవ శరీరం గ్రహిస్తుందని దీంతో గుండె, మెదడు, పునరుత్పత్తి పనితీరుపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఎన్విరాన్‌మెంటల్ రీసెర్స్‌లో ప్రచురించారు. 2020-21 మధ్య ప్రచురించిన 435 అధ్యయనాల్లోని రికార్డులు, గణాంకాలను విశ్లేషించారు. ఈ నివేదికలు అన్నీ 2012 మధ్యలో తయారుచేసినవి. అప్పట్లో మొబైల్ వాడకం పెద్దగా లేదు. కానీ ఇప్పుడున్న సాంకేతికత, 4జీ,5జీల కారణంగా రేడియేషన్ ఫ్రీక్వెన్సీ మరింతగా పెరిగింది. ప్రస్తుత పరిశోధనల్లో మగవారి పై రేడియో ఫ్రీక్వెన్సీ ప్రభావం భారీగా ఉంటుందని, అందుకే మొబైల్ వాడకాన్ని తగ్గించుకోవాలని నిపుణులు సూచించారు.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది