Beauty Tips : ఐదు నిమిషాల్లో బ్లాక్ హెడ్స్ ని మాయం చేసి ముఖాన్ని తెల్లగా చేసే అద్భుతమైన చిట్కా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : ఐదు నిమిషాల్లో బ్లాక్ హెడ్స్ ని మాయం చేసి ముఖాన్ని తెల్లగా చేసే అద్భుతమైన చిట్కా..!

 Authored By pavan | The Telugu News | Updated on :3 May 2022,1:00 pm

Beauty Tips : చాలా మంది చక్కగా ఉన్నప్పటికీ.. వాటిపై వచ్చే నల్ల మచ్చల కారణంగా అదోలా కనిపిస్తుంటారు. అయితే ఆసుపత్రులు చుట్టూ తిరిగి ఎన్ని క్రీములు రాసినా, ఏం చేసినా అవి అలాగే ఉంటాయి. అంటే రాసినంత సేపు పోయినప్పటికీ మళ్లీ రెండు మూడు రోజుల్లోనే మొదలవుతుంటాయి. కేవలం బ్లాక్ హెడ్స్ యే కాదండోయ్.. వైట్ హెడ్స్ కూడా తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాయి. అయితే అలాంటి వాటిని ఇంట్లో ఉండే పోగొట్టుకోవచ్చు. ఇందుకోసం ఈ చిన్ని చిట్కాని ఫాలో అవ్వండి.ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ బియ్యప్పిండి వేసుకోవాలి. దీనిలో అరచెంచా కాపీ పౌడర్ వేసుకోవాలి. కొంచెం కొంచెంగా తేనె వేసుకొని కలుపుతూ ఉండాలి.

ఇవి బాగా పలుచగా కాకుండా బాగా గట్టి కాకుండా కలుపుకోవాలి. అయితే ఈ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆపై వేడి నీళ్లతో ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టడం వల్ల ఫోర్స్ ఓపెన్ అవుతాయి. తర్వాత ఈ ప్యాక్ ను ముక్కు మరియు గడ్డంపై అప్లై చేసి ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి. తర్వాత ముఖం మొత్తం అప్లై చేసుకోవాలి. ఐదు నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత తడి క్లాత్ తో లేదా నీటితో ముఖం కడుక్కోవాలి. తర్వాత ప్యాక్ ని రెడీ చేసుకోవాలి. అర చెంచా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వద్దనుకున్న వాళ్లు క్యారెట్ జ్యూస్, బీట్ రూట్ జ్యూస్ లేదా పొటాటో జ్యూస్ వేసుకోవచ్చు. తర్వాత టొమాటో కట్ చేసుకొని పల్ప్ కాకుండా రసం పిండుకోవాలి.

Beauty Tips home made peel mask for black heads

Beauty Tips home made peel mask for black heads

తర్వాత దీనిలో ఒక చెంచా ఫీల్ ఆఫ్ మాస్క్ వేసుకోవాలి. అన్ని బాగా కలుపుకున్న తర్వాత ఫేస్ మొత్తం అప్లై చేసుకొని ఆరిన తర్వాత పీల్ చేసుకోవాలి. తర్వాత ముఖం మొత్తం శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మీ ముఖంపై ఉండే టాన్ కూడా పోతుంది. రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల ముఖం అందంగా కాంతివంతంగా తయారు అవుతుంది. తేనె మీ చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది. ఆడ, మగ, చిన్న పిల్లలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ ప్యాక్ ని యూస్ చేసుకోవచ్చు. ఈ పేస్ ప్యాక్ లో శనగ పిండి బదులుగా ముల్తానీ మట్టి, గంధం పొడి కడా ఉపయోగించుకోవచ్చు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది