Beauty Tips : మీ ముఖంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించుకోండి ఇలా…
మహిళలకు అవాంచితరోమాలు ఎక్కడపడితే అక్కడ వస్తుంటాయి. ముఖ్యంగా ముఖంలో గడ్డం కింద, పై పెదవుల పైన వస్తూ ఉంటాయి. వీటి వలన కొందరు నలుగురులోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అవాంచిత రోమాలను తొలగించుకోవాలని పార్లర్కి వెళ్లి వేలవేల డబ్బులను వృధా చేస్తారు. అయినా ముఖంలో ఎటువంటి మార్పు ఉండదు. అలా చేస్తే కొన్ని రోజులు కనబడకుండా ఉంటాయి అంతే. ఈ అన్ వాంటెడ్ హెయిర్ ను తొలగించుకోవడానికి మార్కెట్లో రకరకాల ప్రోడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మన ఇంట్లో దొరికే కొన్నింటితో ఎటువంటి నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.
ముఖంపై వచ్చే అవాంచిత రోమాలను తొలగించుకోవాలంటే ముందుగా చిన్న పట్టిక బెల్లం ను తీసుకోవాలి. దానిని వేడి నీటిలో వేసి బాగా కరగనివ్వాలి. ఇలా కాసేపటికి పటిక బెల్లం కరిగిపోతుంది. పటిక బెల్లం కరిగిన నీటిలో కాటన్ తో ముంచి అవాంచిత రోమాలు ఉన్న ప్రదేశం లో రాసుకోవాలి. ముఖం మొత్తం రాసుకున్న పర్వాలేదు. ఇలా రాసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పాటు ఆరనివ్వాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ గోధుమపిండి లేదా శనగపిండిని వేసుకోవాలి. తర్వాత దానిలో అర స్పూన్ తేనె వేసుకోవాలి. తేనెకు బదులుగా అలోవెరా జెల్ ని కూడా వేసుకోవచ్చు. తర్వాత రెండు లేదా మూడు స్పూన్ల చల్లార్చిన పాలు వేసి బాగా కలుపుకోవాలి.
దానిలో కావాలంటే జెలాటిన్ పౌడర్ ను వేసుకోవచ్చు. ఇది ఈ మార్కెట్లో దొరుకుతుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని అవాంచిత రోమాలు ఉన్న అప్పర్ లిప్, గడ్డం వంటి భాగంలో అప్లై చేసి బాగా ఆరనివ్వాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని మసాజ్ చేస్తూ ప్యాక్ ను తీసేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేయడం వలన ముఖంపై ఉండే అవాంచిత రోమాలు తొలగిపోతాయి. పార్లర్ కి వెళ్లకుండా ఇంట్లోనే సులువుగా నొప్పి లేకుండా తొలగించుకోవచ్చు. ఈ చిట్కాతో సులువుగా అన్వాంటెడ్ హెయిర్ ను తొలగించుకోవచ్చు. దీనిని ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. కనుక ఇంట్లో ఉండే వస్తువులతో సులువుగా ముఖంపై వచ్చే అవాంచిత రోమాలను తొలగించుకోవచ్చు.