Beauty Tips : మీరు ఇలాంటి సబ్బును వాడుకోండి పరవాలేదు.. మురికి, జిడ్డు పోవాల్సిందే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : మీరు ఇలాంటి సబ్బును వాడుకోండి పరవాలేదు.. మురికి, జిడ్డు పోవాల్సిందే…

 Authored By prabhas | The Telugu News | Updated on :25 July 2022,3:30 pm

Beauty Tips ; కొంతమందిలో ముఖము, శరీరము, మెడ ,చేతులు నల్లగా మారిపోతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి వాతావరణం వల్ల ఇలా మారుతూ ఉంటాయి. అలాగే మరికొందరు వాళ్ళ కు ఉన్న బిజీ లైఫ్ ను బట్టి సరిగా శరీరాన్ని పట్టించుకోరు, అలాంటి టైం లో మెడ, చుట్టూ మొహం మీద ఇలా చాలా చోట్ల నల్లగా మురికి పట్టి మొండిగా తయారవుతూ ఉంటుంది.అలాంటప్పుడు ఎన్నో సబ్బులను, కొన్ని రకాల క్రీములను వాడుతూ ఉంటారు. కానీ వాటి వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. అయితే ఇలాంటి క్రీమ్ ల తో మీరు ప్రతిరోజు వాడే సబ్బుతో దీన్ని కలిపి చూడండి.

అది ఎలా తయారు చేయాలో చూద్దాం..మీరు వాడుతున్న సబ్బును తీసుకొని, దానిని మెత్తగా తురుముకోవాలి. తరువాత దీనిలోకి పాలను తీసుకొని కొద్దిగా వేడి చేసుకుని, దానిపైన మీగడ ను తీసివేయాలి. తరువాత 100 ఎం.ఎల్ వరకు పాలను తీసుకుని, దానిలో ముందుగా తరిగిన సబ్బు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో ఒక స్పూన్ ఉన్నారా కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే దానిలో ఒక పావు స్పూన్ పచ్చి పసుపు వేసి కలుపుకోవాలి. అలాగే దీనిలో గ్లిజరిన్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి.మీరు ఎలాంటి సబ్బునైన వాడుకోండి పరవాలేదు. కానీ దీనిలో ఇది కలిపి రాసుకుంటే సంవత్సరాల పొడుగునా ఉన్న మురికి, జిడ్డు పోవాల్సిందే…

Beauty Tips on You can use this kind of soap

Beauty Tips on You can use this kind of soap

వీటన్నిటిని బాగా కలుపుకొని దానిని స్టవ్ పైన పెట్టి బాగా క్రీం లాగా అయ్యే వరకు ఉంచి, క్రీం లాగా అయిన తర్వాత దీనిని దింపివేసి దాన్ని ఒక బౌల్ లోకి మార్చుకొని ప్రతిరోజు స్నానం చేసే ముందు శరీరం అంతట రాసుకొని బాగా రుద్దుకుంటూ, తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వలన శరీరం పై ఉన్న నలుపు పోయి తెలుపుగా మారుతుంది. అలాగే ఎన్ని రోజులు నుంచి ఉన్న మురికి కూడా పోతుంది. అయితే ఈ మిశ్రమం మూడు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఇలా మూడు రోజులు రాసుకొని తర్వాత ఒక వారం తర్వాత మళ్లీ తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఇలా నెలలో నాలుగు ఐదు సార్లు వాడితే చాలు..

Tags :

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది