Beetroot Health Benefits : బీట్ రూట్ జ్యూస్ లాభాలు తెలుసా.. తెలుసుకున్నాక మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
ప్రధానాంశాలు:
Beetroot Health Benefits : బీట్ రూట్ జ్యూస్ లాభాలు తెలుసా.. తెలుసుకున్నాక మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
Beetroot Health Benefits : బీట్ రూట్ ను చాలా మంది అవైడ్ చేస్తుంటారు కానీ అందులో ఉండే పోషక విలువలు తెలిస్తే అందరు నోరెళ్లబెడతారు. బీట్ రూట్ ని తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఐతే ఎవరో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప అందరు దీన్ని పాటించరు. ఐతే ఈ బీట్ రూట్ లాభాలు తెలిస్తే మీరే ఈసారి కావాలని కొని తెచ్చుకుంటారు. దుంప జాతికి చెందిన బీట్ రూట్ లో కావాల్సినన్ని పోషక విలువలు ఉన్నాయి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహకరిస్తాయి. ఇందులోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. రోగాలు వచ్చాక తినడం కాదు అసలు రోగాలు మన దరికి చేరకుండా బీట్ రూట్ సహకరిస్తుంది. బీట్ రూట్ లో ఐరన్, పొటాషియం, ఫోలెట్, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపరచడం లో కూడా ఇది ఉపయోగపడుతుంది.
Beetroot Health Benefits మధుమేహ వ్యాధిగ్రస్తులకు..
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచిది. బీట్ రూట్ ను జ్యూస్, సలాడ్ ఇంకా సూప్ లేదా సలాడ్ లా కూడా చేసి తీసుకుంటారు. కొంతమంది రెగ్యులర్ గా కూరలా కూడా చేసుకుంటారు. ప్రతిరోజూ బీట్ రూట్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.సీజనల్ డిసీజెస్ వచ్చే టైంలో అవి రాకుండా ఉండటానికి రెసిస్టెన్స్ పవర్ పెంచుకునేందుకు బీట్ రూట్ ఉపయోగపడుతుంది. బీట్ రూట్ వల్ల ఇన్ ఫెక్షన్ కూడా తగ్గుతుంది. ఇందులోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇన్ ఫెక్షన్ ప్రమాదం తగ్గిస్తాయి. కడుపులోని జీర్ణ సమస్యలను కూడా ఇది దూరం చేస్తుంది.

Beetroot Health Benefits : బీట్ రూట్ జ్యూస్ లాభాలు తెలుసా.. తెలుసుకున్నాక మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, గుండెల్లో మంట లాంటి వాటికి బీట్ రూట్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రక్తపోటు తగ్గించడంలో కూడా బీట్ రూట్ సహకరిస్తుంది. బీట్ రూట్ జ్యూస్ వల్ల అందులోని నట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలు విస్తరించేందుకు సహకరిస్తుంది. దాని వల్ల రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది.