Weight Loss : ఈ ఆకుల టీతో కొలెస్ట్రాల్ కు ఈజీగా కరిగించుకోవచ్చు…!
ప్రధానాంశాలు:
Weight Loss : ఈ ఆకుల టీతో కొలెస్ట్రాల్ కు ఈజీగా కరిగించుకోవచ్చు...!
Weight Loss : ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య అధిక బరువు…ఈ అధిక బరువు, కొలెస్ట్రాల్ తో చాలామంది సతమతమవుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అలసిపోతున్నారు. ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక మైనం ల లాంటిది. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికమవుతే గుండెపోటు, గుండె సమస్యలు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి ఊబకాయం, హైపర్ టెన్షన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. అయితే అలాంటి కొలెస్ట్రాల్ ను మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. కొన్ని రకాల ఆకులతో టీ చేసుకుని తాగినట్లయితే ఈ కొలెస్ట్రాలకు చెక్ పెట్టవచ్చు…
ఆకులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం…ముందుగా మెంతి ఆకులు: ఈ మెంతి ఆకులు అంటే అందరికీ తెలిసినవే.. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ ఆకుల్లో కొలెస్ట్రాల్ని కరిగించే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఆకుకూరను సలాడ్లలో వం టలలో చేర్చుకోవాలి. అలాగే తాజా ఆకులను తీసుకొని శుభ్రం చేసుకుని నీటిలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఆ నీటిని ఉదయం పూట పరిగడుపున తీసుకోవాలి.
నేరేడు ఆకులు:ఈ నేరేడు ఆకులు అధిక బరువు కొలెస్ట్రాలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ను కరిగించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ నేరేడు ఆకులను తీసుకొని నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని ప్రతిరోజు పరిగడుపున తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే మీ కొలెస్ట్రాల్ మటుమాయమవుతుంది..
వేపాకులు; ఈ వేప ఆకులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇంప్లమెంటరీ పుష్కలంగా ఉంటాయి. వేపాకులు కొలెస్ట్రాల్ కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ పొడిని ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ వరకు వేసి ఈ నీటిని బాగా మరిగించి ఈ కాషాయాన్ని ప్రతిరోజు రెండుసార్లు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నట్లయితే మీ కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది.