Body Pian : ఈ ఆకులతో బాడీ పెయిన్స్ ను ఈజీగా నియంత్రించవచ్చు..!
Body Pian : ప్రస్తుత కాలంలో మనం ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా. వాటిలలో బాడీ పెయిన్స్ కూడా. అయితే బాడీ పెయిన్స్ తగ్గించుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం.అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిల్లో ఆమోదం చెట్టు కూడా ఒకటి. ఆముదం చెట్టులోని ప్రతి భాగం కూడా చాలా ఉపయోగకరమైనది. పూర్వ కాలంలో అధికంగా ఆముదం నూనెను వాడేవారు. తలకు మరియు చర్మానికి ఈ ఆముదాన్ని పట్టించేవారు. కేవలం ఆముదం నూనె మాత్రమే కాక ఆకులు మరియు గింజలను కూడా శరీరంలో పలు సమస్యలు తగ్గించడంలో ఎంతో బాగా పని చేస్తుంది. ఇలాంటి ఎన్నో అనారోగ్య సమస్యలు నియంత్రించడంలో కూడా ఈ ఆముదం నూనె మరియు ఆకులను ఆయుర్వేదంలో కూడా వాడుతారు..
సాధారణంగా అప్పుడప్పుడు బాడీ పేయిన్స్ అనేవి మనకు తరచుగా వస్తూ ఉంటాయి. అలాంటి తరుణంలో ఆముదం మొక్కలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ లో ఫ్రై చేయాలి. తరువాత చిన్న క్లాత్ తో కట్టి నొప్పులు ఉన్న దగ్గర రుద్దినట్లయితే నొప్పుల నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే పెద్దలకు మరియు చిన్న పిల్లలకు కూడా ఈ ఆముదం నూనె ఎంతో చక్కగా పనిచేస్తుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలను కూడా నియంత్రిస్తుంది.

Body Pian : ఈ ఆకులతో బాడీ పెయిన్స్ ను ఈజీగా నియంత్రించవచ్చు..!
మలబద్ధక సమస్య ఉన్నటువంటి వారు మరియు కడుపులో నులిపురుగులు ఉన్నటువంటి వారు కూడా ఈ ఆముదం నూనెను పరిగడుపున తాగితే తప్పనిసరిగా అవి కంట్రోల్ అవుతాయి. అంతేకాక కాళ్లు మరియు చేతులు, మోకాళ్లు, నడుము, భుజాలు, మెడ ఇలా శరీరంలో ఏ భాగంలోనైనా సరే నొప్పి పుట్టినట్లయితే ఈ ఆముదం నూనెతో మర్దన చేసుకుంటే చాలు,ఈ నొప్పుల నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. ఎలాంటి టాబ్లెట్స్ వేసుకోకుండా దీనిని ఇలా ట్రై చెయ్యండి. వెంటనే మీ బాడీ పైయిన్స్ నుండి ఉపశమనం పొందవచ్చు..