Carrot : క్యారెట్ ను పచ్చిగా తింటే కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Carrot : క్యారెట్ ను పచ్చిగా తింటే కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

Carrot  : క్యారెట్ అద్భుతాల నిధి అని చెప్పొచ్చు. ఇలాంటి క్యారెట్ మార్కెట్లో దొరికిన పట్టించుకోవట్లేదు చాలామంది. రోజుకు గ్లాసు క్యారెట్ తాగితే అలాగే పచ్చి క్యారెట్లు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆడవారు క్యారెట్ జ్యూస్ తాగడం తప్పకుండా అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ప్లాస్మా కెరటన్ మెరుగుపడతాయి. రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. క్యారెట్ లో విటమిన్ ఏ పుష్కలంగా దొరుకుతుంది. ఇందులో బీటా కెరోటిన్ కూడా లభిస్తుంది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 February 2024,9:00 am

Carrot  : క్యారెట్ అద్భుతాల నిధి అని చెప్పొచ్చు. ఇలాంటి క్యారెట్ మార్కెట్లో దొరికిన పట్టించుకోవట్లేదు చాలామంది. రోజుకు గ్లాసు క్యారెట్ తాగితే అలాగే పచ్చి క్యారెట్లు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆడవారు క్యారెట్ జ్యూస్ తాగడం తప్పకుండా అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ప్లాస్మా కెరటన్ మెరుగుపడతాయి. రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. క్యారెట్ లో విటమిన్ ఏ పుష్కలంగా దొరుకుతుంది. ఇందులో బీటా కెరోటిన్ కూడా లభిస్తుంది. ఇవి కంటికి చాలా ఉపయోగకరం కనులని ఆరోగ్యంగా ఉంచి కంటి చూపులు మెరుగుపరుస్తాయి. క్యారెట్ ముఖ సౌందర్యానికి కూడా మంచిది. ఇందులో దొరికే యాంటీ ఆక్సిడెంట్స్ పొటాషియం కొత్త కణాలు పుట్టుక రావడానికి సహాయపడతాయి.

చర్మం అందంగా తయారవుతుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది సిస్టోలిక్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. డయాబెటిస్ ని అడ్డుకునేందుకు కూడా క్యారెట్ ఉపయోగపడుతుంది. ఇందులో దొరికే మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. క్యారెట్ రోజు ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే రోగ నిరోధక శక్తికి ఇది ఎంతో మేలు చేస్తుంది. క్యారెట్ లో ఐరన్ విటమిన్ సి దొరుకుతాయి. శరీరంలో ఉండే అనీమియా లోపం క్యారెట్ ద్వారా కవర్ చేయొచ్చు. క్యారెట్ లో పొటాషియం ఫాస్పరస్ విటమిన్ బి6 కూడా లభిస్తాయి.

బలమైన నరాల వ్యవస్థకు బలమైన ఎముకలు చురుకైన మెదడు పొందడానికి క్యారెట్ గొప్ప సాధనం. ఇంతే కాదు క్యారెట్ జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్ వంటి డిజార్డర్తో పోరాడుతుంది.
ప్రతిరోజు క్యారెట్లు పచ్చివి తింటే తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. తద్వార పక్షివాతం నివారించబడతాయి. క్యారెట్లలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు పదార్థాలను తొలగిస్తాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది