Health Benefits : వందేళ్లు వచ్చినా కళ్లు బాగా కనిపించాలంటే ఇది కచ్చితంగా తినాల్సిందే..!
Health Benefits : పంట పొలాల వద్ద, ఇంటి పెరట్లో ఎక్కువగా కనిపించే ఈ మొక్కను ఆకుకూరగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రరయోజనాలు ఉన్నాయి. అయితే ఈ ఆకు కూర ఎక్కడ పడితే అక్కడ కనిపించడం వల్ల దీన్ని కలుపు మొక్క అనుకుంటారు చాలా మంది. కానీ ఇది తింటే కలిగే మేలు గురించి తెలిస్తే మాత్రం అస్సలే దీన్ని వదిలి పెట్టరు. అంతే కాదండోయ్ ఈ మొక్క పేరు ఒక్కో చోటు ఒక్కోలా పిలుస్తారు. అయితే దీన్ని చంచల కూర అని, చెంపల చెట్టు, చెంపల ఆకుగా పిలుస్తుంటారు. సంస్కృతంలో అరణ్య, అరణ్య వస్తుక అని కూడా అంటారు. ఈ మొక్క అమరాంథేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నానం డిగేలా మూరికాటా. పల్లెటూర్లలో ఈ ఆకును ఆకు కూరగా వండుకొని తింటారు.
చిన్న పిల్లలు ఈ చెట్టు నుంచి వచ్చే పుఫ్పాలను సేకరించి వాటి నుంచి వచ్చే తీపి కోసం వాటిని నోట్లో పెట్టుకొని పీల్చే వాళ్లు.అయితే ఈ చెంచాలకు మొక్కలు ఎక్కువగా కెన్యా, ఉగండా, మలేషియా, సౌదీ అరేబియా. మడగాస్కర్, సోమాలియా, భారత దేశంలో కనిపిస్తుంటాయి. అయితే ఈ మొక్కలను పూర్వం నుండే మన సంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు. ఈ మొక్క ఆకులను ఉపయోగించి ఆస్తమా, తామర, ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్, రుతుక్రమం ఆగిన లక్షణాలు వంటి అనేక పరిస్థితులకు చికిత్స చేసేందుకు హెర్బల్ మెడిసిన్ గా ఉపయోగిస్తారు. చెంచలాకు ఒక వార్షిక మూలిక. ఇది 20 నుంచి 70 సెంటీ మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. అయితే ఈ చెంచలాకులను ప్రతిరోజూ ఆహారంలో వాడుతుంటారు చాలా మంది.
అయితే ఈ మొక్క తినడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. పొలం పనులు చేసే వారు ఎండలో ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో వేడి చేస్తుంది. అలాంటప్పడు వీటిని తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అంతే కాదండోయ్ చెంచలాకు కషాయం తీసుకోవడం వల్ల మూత్ర ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ చెట్టు వేర్ల కషాయాన్ని తాగడం వల్ల బాలింతల్లో పాల వృద్ధి బాగా జరుగుతుంది. ఈ ఆకుల్లో కాల్షియం ఎకువగా ఉంటుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇందులో విడామిన్ ఏ కూడా ఉంటుంది. ఇది కంటి సమస్యలను తగ్గించి కంటి చూపు మెరుగయ్యేలా చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.