Cloves : మీరు బరువు ఈజీగా తగ్గాలనుకుంటున్నారా.? నో వర్రీ… లవంగాలను ఇలా ట్రై చేయండి..!
ప్రధానాంశాలు:
Cloves : మీరు బరువు ఈజీగా తగ్గాలనుకుంటున్నారా.? నో వర్రీ... లవంగాలను ఇలా ట్రై చేయండి..!
Cloves : చాలామంది ఈజీగా బరువు తగ్గాలని అనుకుంటూ ఉంటారు.. అలాంటివారు ఎన్నో ప్రయత్నాలు చేసే అలసిపోతూ ఉంటారు. వారికి ఇప్పుడు లవంగాలతో అద్భుతమైన టిప్ చెప్పబోతున్నాం.. ఈ టిప్ తో ఈజీగా బరువు తగ్గవచ్చు. లవంగాలు వీటిని మసాలా దినుసుగా వాడుతారు. వంటల్లో వాసన, రుచి పెంచి ఈ లవంగాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో అధికంగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. లవంగాల నూనెతో కూడా చాలా లాభాలు ఉంటాయి. దీనిని అప్లై చేయడం వల్ల నొప్పులు, జలుబు తగ్గుతాయి.వీటితోపాటు మరే సమస్యలు తగ్గుతాయో ఇప్పుడు మనం చూద్దాం.
Cloves రాత్రి డిన్నర్ తర్వాత
కొంతమంది డిన్నర్ లేటుగా చేస్తూ ఉంటారు. దీని కారణంగా బరువు పెరుగుతారు. అలా కాకుండా ఉండాలంటే త్వరగా డిన్నర్ ముగించాలి. డిన్నర్ తర్వాత ఓ లవంగాన్ని నమిలి మింగాలి. దీనివలన బరువు పెరగకుండా నియంత్రిస్తుంది ?
బరువుకి చెక్ : లవంగాలు శరీరంలో వేడిని పెంచుతాయి. కావున తీసుకోవద్దని చెప్తారు. కానీ ఈ లక్షణం బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. జీర్ణ క్రియని మెరుగుపరుస్తుంది. దీంతో పాటు టాక్సిన్ ని బయటకి పంపుతుంది. కావున వీటిని రోజుకు ఒకటి చొప్పున తీసుకోవచ్చు.
మొటిమలు సమస్య : లవంగాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు. అందాన్ని రక్షించడంలో కూడా ముందు వరుసలో ఉంటాయి. దీనికోసం లవంగాలను మెత్తని పొడిలా చేసి తేనె కలిపి ముఖంపై ఉన్న మొటిమల మీద అప్లై చేయాలి. డైరెక్టుగా రాస్తే మండుతుంది.
కావున తేనె కలిపి రాయడం మంచిది. దీనిలోని ఆంటీ బ్యాక్టీరియా గుణాలు ఈ సమస్యను తగ్గిస్తాయి. అదేవిధంగా ఈ నూనె జలుబు అయిన సమయంలో ఛాతి, గొంతు దగ్గర రాస్తే మంచి ఉపశమనం పొందవచ్చు..
జీర్ణ సమస్యలు : లవంగాలలో పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు ఉంటాయి. దీనిలోని యూస్నల్ అనే ఎంజైము ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని నమలడం ఇష్టం లేనివారు నీటిలో లవంగాలను వేసి మరిగించి ఆ నీటిని తీసుకోవచ్చు. రోజుకొకటి కంటే ఎక్కువ తీసుకోవద్దు.
దంత సమస్యలు : శరీరంలో కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్ చాలా ముఖ్యం. లవంగాలలో అవి పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే నోటి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. నోట్లోని బ్యాక్టీరియాని నాశనం చేస్తాయి. దీంతో నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. దీనికోసం లవంగాలు మరిగించిన నీటిని వాడాలి.