Empty Stomach : ఛాతిలోని మంటను తగ్గించాలంటే… ప్రతిరోజు పరిగడుపున దీనిని తింటే చాలు…!
ప్రధానాంశాలు:
Empty Stomach : ఛాతిలోని మంటను తగ్గించాలంటే... ప్రతిరోజు పరిగడుపున దీనిని తింటే చాలు...!
Empty Stomach : ప్రస్తుత కాలంలో మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యలలో ఒకటి ఛాతిలో మంట. మనలో ఎంతో మందికి ఎదురయ్యే సాధారణ సమస్యలలో ఛాతిలో నొప్పి కూడా ఒకటి అని చెప్పవచ్చు. అయితే మనలో ఎంతోమంది ఏదో ఒక టైమ్ లో ఈ సమస్యల బారిన పడే ఉంటారు. అయితే మనం తీసుకునేటటువంటి ఆహారంలో మార్పులు కారణంగా మరియు ఎక్కువ పులుపు అలాగే మసాలా ఫుడ్ ను తీసుకున్న టైం లో ఈ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాలలో ఛాతిలో నొప్పి అనేది ఒక రేంజ్ లో పెరుగుతుంది. ఆ టైంలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటాము. అయితే ఛాతిలో మంట అనేది గుండెకు సంబంధించిన సమస్యలకు కూడా లక్షణం కావచ్చు అనే భావన చాలా మందిలో ఉంది.
అందువల్ల వెంటనే వైద్యులను సంప్రదిస్తారు. అయితే ఈ ఛాతిలో మంట అనేది గుండెకు సంబంధించిన సమస్యలకు కారణం అని అనడంలో నిజం ఉన్నప్పటికీ ప్రతిసారి ఇదే కారణం అని మాత్రం చెప్పలేము. అయితే ఈసీజీ ఇలాంటి పరీక్షలు చేయించుకున్నప్పటికీ వాటిలో నార్మల్ గా ఉన్న ఛాతి లో మంట అనేది వస్తూ ఉంటే దానికి జీర్ణ సమస్యలకు కారణం అని కూడా చెప్పవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే మన జీర్ణశయంలో రసాలు అనేవి గొంతులోకి ఎగదనుకుంటూ మరీ వస్తాయి. దీనివలన ఛాతితో పాటు అప్పుడప్పుడు గుండెల్లో బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు నిత్యం పెరుగు తీసుకుంటే మంచిది అని నిపునులు అంటున్నారు. అలాగే ఛాతిలోని మంటతో ఇబ్బంది పడేవారు నిత్యం పరిగడుపున రెండు చెంచాల పెరుగును తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. ఇది ఛాతిలోని మంటను నియంత్రించడంలో బాగా హెల్ప్ చేస్తుంది.
అంతేకాకుండా ఎక్కువ నీరు తీసుకోవడం వలన కూడా ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చు. అలాగే మనం రోజులో కనీసం మూడు లీటర్ల వరకు నీరు తాగాలి అని అంటున్నారు నిపుణులు. అంతేకాక భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు అని అంటున్నారు. భోజనం చేసిన గంట తరువాత మాత్రమే పడుకోవాలి అని అంటున్నారు. ఇక మనం తీసుకునే ఆహారంలో కూడా ఛాతిలో మంటను కలిగిస్తుంది అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మసాలా మరియు కారం లాంటివి ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు వేపుళ్లను కూడా తీసుకోవద్దు అని అంటున్నారు. అలాగే మీరు ప్రతిరోజు కూడా టైం కి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఆహారాన్ని గబగబా తినకుండా నెమ్మదిగా తింటూ పూర్తిగా నమిలినా తర్వాత మాత్రమే మింగాలి. ఇకపోతే కాఫీ మరియు కూల్ డ్రింక్స్ సైతం ఛాతిలో మంటకు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. కావున వీటన్నిటికీ దూరంగా ఉండటం చాలా అవసరం….