Heart : మీ గుండె ఆరోగ్యం కోసం కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే…!
ప్రధానాంశాలు:
Heart : మీ గుండె ఆరోగ్యం కోసం కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే...!
Heart : ప్రస్తుత కాలంలో గుండె సమస్యలు అనేవి ప్రతి ఒక్కరిని పీడిస్తున్నాయి. అయితే వయసు తో సంబంధం అనేది లేకుండా గుండె సమస్యలు అనేవి అందరిలో బాగా పెరుగుతున్నాయి. అయితే వృద్ధులు మాత్రమే కాక, పిల్లలు కూడా గుండె సమస్యలు బారిన ఎక్కువగా పడుతున్నారు. అంతేకాక క్రమశిక్షణ లేని ఆహారం అలవాట్లు మరియు చెడు జీవన శైలి ఈ వ్యాధికి మూల కారణమని చెప్పొచ్చు. అయితే జన్యుపరమైన కారణాల వలన కూడా ఎంతో మంది గుండె సమస్యలతో బాధపడతారు. కావున ఎంతో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. అయితే గుండె సమస్యలను తగ్గించడానికి బయట ఫాస్ట్ ఫుడ్ ను తీసుకోవడం పూర్తిగా మానేయాలి. అలాగే నూనె మరియు నెయ్యి తినాలి అనే తాపత్రయానికి కూడా తగ్గించుకోవాలి. అంతేకాక రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం కచ్చితంగా చేయటం అలవాటు చేసుకోవాలి అని నిపుణులు అంటున్నారు…
అయితే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటే ఆహారంలో కొన్ని కూరగాయలను నిత్యం కచ్చితంగా తీసుకోవాలి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిలలో ఒకటి బీట్రూట్. ఈ బీట్ రూట్ లో అస్పరాప్టిన్ అనే పదార్థం కూడా ఉంటుంది. ఇది రక్త ప్రభావాన్ని కూడా ఎంతగానో పెంచుతుంది. అంతేకాక రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. దీని ఫలితంగా ఎన్నో సంక్లిష్ట సమస్యలను కూడా తగ్గించవచ్చు. అలాగే ఇవి గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో మెరుగుపరుస్తాయి. ఇంకొక కూరగాయ టమాట. ఈ టమాటాలో లైకొఫిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది హృదయనాల వ్యవస్థను ఎంతో ఆరోగ్యంగా ఉంచటంలో మేలు చేస్తుంది. దీని ఫలితంగా టమాటాను తీసుకోవడం వలన గుండె సమస్యలు అనేవి దూరం అవుతాయి. అంతేకాక గుండె ఆరోగ్యం కోసం చిలకడ దుప్పలను కూడా ఎక్కువగా తీసుకుంటే మంచిది. వీటిలో ఎంతో ప్రయోజనకరమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.
దీని ఫలితంగా గుండెతో పాటుగా శరీరంలోని ఎన్నో అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సీజనల్ వెజిటేబుల్స్ ను కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వాపును నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి. అంతేకాక తొందరగా గుండె సమస్యలను కూడా దూరం చేయగలవు. అలాగే కూరగాయలలో ఉండేటటువంటి పీచు ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. కావున నిత్యం ఆహారంలో ఈ కూరగాయలను కచ్చితంగా తీసుకోవాలి…