Dengue : వేగంగా విజృంభిస్తున్న డెంగ్యూ… ఈ లక్షణాలు కనిపిస్తే… వెంటనే అప్రమత్తం అవ్వండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dengue : వేగంగా విజృంభిస్తున్న డెంగ్యూ… ఈ లక్షణాలు కనిపిస్తే… వెంటనే అప్రమత్తం అవ్వండి…

Dengue : వర్షాకాలం రానే వచ్చింది. ఈ వర్షాకాలం అంటేనే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో చుట్టూ నీరు నిలవడం వలన దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో డెంగ్యూ జ్వరాలు మొదలవుతాయి. ఈ కాలంలో జ్వరంతో పాటు శరీర నొప్పులు ఉన్నట్లయితే ముందే జాగ్రత్త పడడం మంచిది. అందువలన జ్వరం రాగానే ముందు డెంగ్యూ సోకిందో లేదో తెలుసుకోవాలి. అయితే డెంగ్యూ జ్వరం అనేది సోకినప్పుడు 101 నుండి 102 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 August 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Dengue : వేగంగా విజృంభిస్తున్న డెంగ్యూ... ఈ లక్షణాలు కనిపిస్తే... వెంటనే అప్రమత్తం అవ్వండి...

Dengue : వర్షాకాలం రానే వచ్చింది. ఈ వర్షాకాలం అంటేనే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో చుట్టూ నీరు నిలవడం వలన దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో డెంగ్యూ జ్వరాలు మొదలవుతాయి. ఈ కాలంలో జ్వరంతో పాటు శరీర నొప్పులు ఉన్నట్లయితే ముందే జాగ్రత్త పడడం మంచిది. అందువలన జ్వరం రాగానే ముందు డెంగ్యూ సోకిందో లేదో తెలుసుకోవాలి. అయితే డెంగ్యూ జ్వరం అనేది సోకినప్పుడు 101 నుండి 102 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అలాగే తరచుగా జ్వరం కూడా ఉంటుంది. అలాగే తలనొప్పి మరియు కాళ్ల వెనక భాగంలో నొప్పి, చర్మంపై ఎర్రటి దద్దుర్లు డెంగ్యూ లక్షణాలు కావచ్చు. అలాగే వికారం మరియు ఎముకల నొప్పి మరియు కండరాల నొప్పి కూడా మొదలవుతాయి. ఈ జ్వరం అనేది రెండు రోజులైనా తగ్గకపోయినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించండి. ఈ టైమ్ లో మీరు వీలైనంత ఎక్కువ నీళ్లను తాగటం మంచిది. అలాగే ఎక్కువ ద్రవం కూడా శరీరానికి అందించడం మంచిది. మీకు కొబ్బరి నీళ్లు మరియు నిమ్మరసం కానీ తాగటం ఇష్టం లేకపోతే పండ్ల రసాలను తీసుకోండి…

నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, పారాసెటమాల్ గరిష్ట మోతాదులో రోజుకు నాలుగు గ్రాముల వరకు తీసుకోండి. కానీ కాలేయం మరియు గుండె, మూత్రపిండాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే పారాసిటమాల్ తీసుకునే ముందు వైద్యులను సంప్రదించటం మరవద్దు. అయితే తలనొప్పి ఉన్నవారికి ఆస్పిరిన్ తీసుకోకుండా ఉండటమే ఎంతో మంచిది. ఎందుకు అంటే ఇది రక్తస్రావ సమస్యలకు గురిచేస్తుంది. అయితే ఈ డెంగ్యూ లో ఏ బి సి అనే మూడు రకాలు ఉంటాయి. అయితే సాధారణ డెంగ్యూ ఏ వచ్చినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే డెంగ్యూ బి గనక వచ్చినట్లయితే కడుపునొప్పి వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే డెంగ్యూ సి వచ్చినట్లయితే ఎంతో తీవ్రమైన పరిస్థితికి చేరినట్లే. అయితే ఈ డెంగ్యూ జ్వరం అనేది ఏడిస్ దోమ ద్వారా సోకుతుంది…

Dengue వేగంగా విజృంభిస్తున్న డెంగ్యూ ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి

Dengue : వేగంగా విజృంభిస్తున్న డెంగ్యూ… ఈ లక్షణాలు కనిపిస్తే… వెంటనే అప్రమత్తం అవ్వండి…

నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, ఈ ఎడీస్ దోమలు అనేవి రాత్రి పూట కొట్టవు. ఈ ఎడిస్ దోమలు అనేవి ఉదయం మరియు సాయంత్రం వేళలో చాలా చురుగ్గా ఉంటాయి. అలాగే ఇంటి చుట్టు ఎక్కడ కూడా నీరు అనేది నిలవకుండా చూసుకోండి. ఈ ఎడిస్ దోమ అనేది శుభ్రమైన నీటిలో గుడ్లను పెడుతుంది. ఈ ఎడిస్ దోమలు అనేవి ఇంటి పైకప్పు మీద లేక బాల్కనీలో ఉండే పులాటబ్బులలో, నిర్మాణంలో ఉన్నటువంటి భవనంలో, ఇతర ప్రదేశాలలో మరియు రహదారి పక్కన పడి ఉన్నటువంటి టైర్ల లాంటి ఇతర కంటేనార్లలో వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల వాటిలో ఇవి అభివృద్ధి చెందుతాయి. కావున ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది