Dengue : డెంగ్యూ జ్వరం ఎలా వ‌స్తుంది.. రాక‌ముందు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dengue : డెంగ్యూ జ్వరం ఎలా వ‌స్తుంది.. రాక‌ముందు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :16 June 2021,5:10 pm

Dengue : వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ సమయంలో వైరస్ లు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. అందుకే.. పిల్లలు, పెద్దలు అందరూ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దోమల వల్ల చాలా వ్యాధులు ప్రబలుతాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులు వస్తాయి. వీటిలో డెంగ్యూ, మలేరియా లాంటివి పెద్ద వ్యాధులు. వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అసలు డెంగ్యూ రాకుండా ఏం చేయాలి? వస్తే ఎటువంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

dengue treatment health tips telugu

dengue treatment health tips telugu

సాధారణంగా డెంగ్యూ దోమలు కుట్టడం వల్ల వస్తుంది. దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డెంగ్యూ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. డెంగ్యూ వచ్చిన వారం లోపు దాన్ని లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రంగా జ్వరం రావడం, తలనొప్పి, నీరసం, వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తే.. డెంగ్యూ వచ్చినట్టే. ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే.. డెంగ్యూ తీవ్రత ఎక్కువవుతున్నా కొద్దీ పరిస్థితి సీరియస్ గా అవుతుంది. అందుకే.. డెంగ్యూ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడే దాన్ని ఎదుర్కోవాలి.

Dengue : రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటేనే డెంగ్యూ అటాక్ చేస్తుంది

Dengue

Dengue

అయితే.. దోమలు కుట్టినప్పుడు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లలో అది అటాక్ చేస్తుంది. అందుకే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోగ నిరోధక శక్తి తక్కువవుతున్నా కొద్దీ.. డెంగ్యూ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు డెంగ్యూ అటాక్ అయితే.. dengue hemorrhagic రిస్క్ పెరుగుతుంది. డెంగ్యూ వస్తే.. దానికి సరైన ట్రీట్ మెంట్ లేదు. డెంగ్యూ వచ్చిన వాళ్ల లక్షణాలను బట్టి డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తుంటారు. జ్వరం వచ్చిన వాళ్లు పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవాలి. అలాగే.. కొందరు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కానీ.. పెయిన్ కిల్లర్స్ అస్సలు వాడకూడదు.డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ నే వాడాల్సి ఉంటుంది. డెంగ్యూ వచ్చిన వాళ్లు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. అన్నం తినకుండా.. జ్యూస్ లు తాగాలి. ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. డెంగ్యూ రాకుండా ఉండాలంటే.. ఇంటి దగ్గర, చుట్టు పక్కన, ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో.. ఇంటి దగ్గర ఎటువంటి నీటి గుంతలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. నీటి గుంతలే దోమలకు నిలయం. దోమలు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ వచ్చే చాన్సే ఉండదు.

ఇది కూడా చ‌ద‌వండి ==> Lungs : ఊపిరితిత్తుల సమస్యకు చెక్ పెట్టాలా? ఈ పని చేయండి.. శ్వాస సమస్యలు కూడా దూరమవుతాయి?

ఇది కూడా చ‌ద‌వండి ==> మీకు సంతానం క‌ల‌గ‌డం లేదా.. అయితే రోజూ బీట్ రూట్ క‌చ్చితంగా తినండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Marriage : ఫీలవకండి.. మీకు పెళ్లి కావ‌డం లేదా.. అయితే ఇలా చేసిచూడండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Home Remedies : ఈ ఐదు చిట్కాలు పాటిస్తే మీ దంత్తాలు తేల్ల‌గా మారుతాయి ఒక సారి ట్రై చేయండి ?

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది