Diabetes : మధుమేహులు క్యారెట్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : మధుమేహులు క్యారెట్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

 Authored By pavan | The Telugu News | Updated on :25 April 2022,3:00 pm

Diabetes : క్యారెట్ తినడం వల్ల మధుమేహం పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. అంతే కాకుండా వాటిని షుగర్ పేషెంట్స్ అస్సలే తినకూడదని చెప్తుంటారు. కానీ వాస్తవానికి ఇదంతా అబద్ధమే. క్యారెట్లలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండవు కాబట్టి మధుమేహం ఉన్న వారు క్యారెట్ తీసుకోవచ్చు. వాస్తవానికి, క్యారెట్లు మధుమేహం ఉన్న వారికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.క్యారెట్లలో కెరోటినాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఆహారంలో ఉండే ఈ కెరోటినాయిడ్లు ప్రధానంగా నారింజ, పసుపు రంగు పండ్లు, కూరగాయల్లో అధికంగా ఉంటాయి. వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రెటీనాను దెబ్బతినకుండా కాపాడటానికి సాయ పడుతుంది.

డయాబెటిక్ వల్ల దృష్టి మందగించే వ్యాధి అయిన రెటినోపతికి వ్యతిరేకంగా కెరోటినాయిడ్లు రక్షణగా ఉంటాయి. క్యారెట్ లో బీటా కెరోటిన్, ఆల్ఫా కెరోటిన్ లు ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెరను నియంత్రించడం చికిత్స యొక్క ప్రాథమిక లక్ష్యం. మనిషి రోజు వారీ తీసుకునే కార్బో హైడ్రేట్లు ఈ మధుమేహ స్థాయిపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి. క్యారెట్ లో కార్బో హైడ్రేట్స్ ఉన్నా అవి ఆరోగ్యకరమైనవి. ఇందులోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడుతుంది. డయాబెటిస్ ద్వారా ఎదురయ్యే గుండె వ్యాధి, మూత్ర పిండ వ్యాధి, దృష్టి నష్టం. స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.అలాగే ఇందులో తక్కుస స్థాయిలో ఉండే విటామిన్ ఎ డయాబెటిక్ రోగులకు చాలా మంచిది.

Diabetes patients can eat carrot

Diabetes patients can eat carrot

టైప్ 1 డయాబెటిస్ ఉన్న వారికి ఇది దోహదం చేస్తుంది. క్లోమం మరియు బీటా కణాల ఉత్పత్తిలో విటామిన్ ఎ కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెట్ లో ఉండే ఫైబర్ వల్ల రక్తంలో గ్లూకోజ్ స్ఖాయిలు క్రమబద్ధం అవుతాయి. అంతే కాకుండా శరీరంలో ఉండే ఇన్సులిన్ డయాబెటిస్ ను ఎదుర్కోవడానికి సాయపడతాయి. డయాబెటిస్ ఉన్న వారు కూరగాయలు, పండ్లు మరియు ధాన్యాల నుంచి సమృద్ధిగా లభ్యమయ్యే ఫైబర్ ను తీసుకోవాలి.అలాగే ఇందులో ఉండే కార్బో హైడ్రేట్లు ఒక వ్యక్తి రక్తంలో గ్లూకోజ్ స్తాయిని ప్రభావితం చేస్తాయి. ఉడికించిన క్యారెట్లలో ఈ గ్లూకోజ్ స్థాయిలు తక్కువ ఉంటాయి. అందుకే మధుమేహ సమస్యతో బాధపడుతున్న వారు నిరభ్యంతరంగా క్యారెట్లను తినవచ్చు. దీని వల్ల వారికి వచ్చే ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకున్న వాళ్లు అవుతారు.

Advertisement
WhatsApp Group Join Now

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది