Diabetes : డయాబెటిస్ పేషెంట్లకు ఈ సింటమ్స్ కనిపిస్తే… ప్రమాదం లో పడ్డట్టే… ఏ మాత్రం అశ్రద్ధ చేయకండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : డయాబెటిస్ పేషెంట్లకు ఈ సింటమ్స్ కనిపిస్తే… ప్రమాదం లో పడ్డట్టే… ఏ మాత్రం అశ్రద్ధ చేయకండి…!

Diabetes : ఈ రోజుల్లో చాలామందికి షుగర్ రావడం సాధారణంగా మారింది. అయితే షుగర్ ఉన్న వారు మాత్రం ఎప్పటికప్పుడే టెస్టులను చేయించుకుంటూ ఉండాలి. అలాగే వైద్యులు చెప్పినటువంటి డైట్ ను ఫాలో అవ్వాలి. తమ జీవన శైలి సైతం మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే షుగర్ లెవెల్స్ పెరిగితే మీ శరీరంలోని అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే డయాబెటిస్ ఉన్న పేషెంట్లు ఈ నాలుగు సింటమ్స్ గనుక మీకు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించుకోవాలి […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 July 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Diabetes : డయాబెటిస్ పేషెంట్లకు ఈ సింటమ్స్ కనిపిస్తే... ప్రమాదం లో పడ్డట్టే... ఏ మాత్రం అశ్రద్ధ చేయకండి...!

Diabetes : ఈ రోజుల్లో చాలామందికి షుగర్ రావడం సాధారణంగా మారింది. అయితే షుగర్ ఉన్న వారు మాత్రం ఎప్పటికప్పుడే టెస్టులను చేయించుకుంటూ ఉండాలి. అలాగే వైద్యులు చెప్పినటువంటి డైట్ ను ఫాలో అవ్వాలి. తమ జీవన శైలి సైతం మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే షుగర్ లెవెల్స్ పెరిగితే మీ శరీరంలోని అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే డయాబెటిస్ ఉన్న పేషెంట్లు ఈ నాలుగు సింటమ్స్ గనుక మీకు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించుకోవాలి అని అంటున్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ పీ ఎస్ వలీ. అవి ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Diabetes బీపీ కంట్రోల్ లో ఉండదు

అస్సలు అదుపులో లేని హై బీపీ కిడ్నీ పనితీరులో లోపాలకు ఒక సంకేతం కావచ్చు అని అంటున్నారు. అయితే కిడ్నీ పనితీరు తగ్గినట్లయితే శరీరంలో కెమికల్స్ అనేవి అధిక మోతాదులో రిలీజ్ కావటం వలన బీపీ అనేది కంట్రోల్లో ఉండదు..

కాళ్ళ వాపులు : కాళ్ళ వాపులు ఉన్నవారికి కిడ్నీ సమస్య ఉన్నట్లు కాదు. కానీ కాళ్ల వాపులు కనక ఉన్నట్లయితే వెంటనే కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి..

యూరిన్ లో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ నురగ కనిపించటం : యూరిన్ పాస్ చేసిన తర్వాత క్లియర్ గా నురగ కనిపించినట్లయితే కిడ్నీ ఫంక్షన్స్ గురించి అల్బుమిన్ ప్రోటీన్ లీకేజ్ గురించి కూడా టెస్ట్ చేయించుకోవాలి..

Diabetes డయాబెటిస్ పేషెంట్లకు ఈ సింటమ్స్ కనిపిస్తే ప్రమాదం లో పడ్డట్టే ఏ మాత్రం అశ్రద్ధ చేయకండి

Diabetes : డయాబెటిస్ పేషెంట్లకు ఈ సింటమ్స్ కనిపిస్తే… ప్రమాదం లో పడ్డట్టే… ఏ మాత్రం అశ్రద్ధ చేయకండి…!

షుగర్ ఉన్నవారికి రెటీనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు : కిడ్నీ పరీక్షలు అనేవి కచ్చితంగా చేయించుకోవాలి. అయితే రెటీనా రక్తనాళాలు మరియు కిడ్నీ రక్తనాళాలు స్ట్రక్చరల్ ఫిలాసఫీ అనేది ఒకే రకంగా ఉంటుంది. అందుకే మీకు రెటినా ప్రాబ్లమ్స్ ఉంటే షుగర్ ఉన్నవారు కిడ్నీ టెస్టులను కచ్చితంగా చేయించుకోవాలి.

అంతేకాక షుగర్ ఉన్నవారు ఎప్పటికప్పుడు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ మరియు స్పాట్ యూరిన్ అల్బుమిన్ క్రియాటినిన్ రేషియో, సీరం క్రియాటినిన్ టెస్ట్ లు చేయించుకోవటం చాలా అవసరం…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది