Diabetes : మీలో ఈ లక్షణాలున్నాయా.. మధుమేహం కావచ్చు.. జాగ్రత్త వహించండి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : మీలో ఈ లక్షణాలున్నాయా.. మధుమేహం కావచ్చు.. జాగ్రత్త వహించండి..

Diabetes : దేశంలో డయాబెటిస్ పేషెంట్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే మధుమేహం బారిన పడకుండా ఉండేందుకుగాను జాగ్రత్తలు వహించాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, చాలా మందికి మధుమేహం బారిన పడిన సంగతి ఆలస్యంగా తెలుస్తోంది. కాగా, దానిని ముందే లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. ఎలాగంటే..ఒకసారి మధుమేహం బారిన పడినట్లయితే కంపల్సరీగా పలు నియమాలు, జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక ఈ వ్యాధి బారిన పడితే వారిలో కంపల్సరీగా జీవనశైలిలో ఊహించని మార్పులు వస్తాయి. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :10 January 2022,6:00 am

Diabetes : దేశంలో డయాబెటిస్ పేషెంట్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే మధుమేహం బారిన పడకుండా ఉండేందుకుగాను జాగ్రత్తలు వహించాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, చాలా మందికి మధుమేహం బారిన పడిన సంగతి ఆలస్యంగా తెలుస్తోంది. కాగా, దానిని ముందే లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. ఎలాగంటే..ఒకసారి మధుమేహం బారిన పడినట్లయితే కంపల్సరీగా పలు నియమాలు, జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక ఈ వ్యాధి బారిన పడితే వారిలో కంపల్సరీగా జీవనశైలిలో ఊహించని మార్పులు వస్తాయి.

కాబట్టి రాకమునుపే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. డయాబెటిస్ అనేది ప్రస్తుతం అతి పెద్ద సమస్యగా ఉండింది. డయాబెటిస్ వలన కాళ్లు బాగా వీక్ అయిపోతాయి. మూత్రపిండాలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. హార్ట్ డిసీజెస్ వచ్చే చాన్సెస్ ఉంటాయి. స్కిన్ కూడా ప్రభావితమవుతుంది. ఈ క్రమంలో కంపల్సరీగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.డయాబెటిస్ రావడానికి మునుపు వచ్చే కొన్ని సంకేతాలను ఇప్పుడు గమనిద్దాం. తరచూ మూత్ర విసర్జన చేయాలనిపిస్తుండటంతో పాటు గొంతు లేదా చంకల లోపల నలుపు ప్యాచెస్ ఏర్పడుతుంటాయి.

diabetes signs and symptoms

diabetes signs and symptoms

Diabetes : ఈ లక్షణాలు మీలో ఉన్నాయో చూసుకోండి..

వాటి అర్థం బ్లడ్‌లో ఇన్సులిన్ పెరిగినట్లు. స్కిన్ పై మచ్చలు రావడంతో పాటు మొటిమలు కూడా ఏర్పడుతుంటాయి.అలా మచ్చలు ఏర్పడటం కూడా మధుమేహానికి ముందస్తు సంకేతాలు అని చెప్పొచ్చు. ఓ వ్యక్తి బ్లడ్‌లో షుగర్ లెవల్స్ ఎక్కువ కాలం పాటు ఉన్నట్లయితే నరాలు దెబ్బతినే చాన్సెస్ ఉంటాయి. ఇకపోతే మన శరీరంలో ఏదో ఒక చోట గాయాలు అయినట్లయితే అవి మానకుండా అలానే ఉంటే కనుక అది డయాబెటిస్ ప్రాథమిక లక్షణంగా పరిగణించాలి. రక్త ప్రసరణలో సమస్యలు కూడా తలెత్తొచ్చు. ఇటువంటి సమస్యలు వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించే తగు ట్రీట్ మెంట్ తీసుకోవాలి. లేదంటే డయాబెటిస్ లెవల్ పెరిగే చాన్సెస్ కూడా ఉంటాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది