Diabetes : షుగర్ బాధితులకు పెసరపప్పు ఒక వరం… దీన్ని ఆహారంలో చేర్చుకుంటే అద్భుతమైన లాభాలు…
Diabetes : ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో చాలామంది షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ఎటువంటి ఆహార తీసుకోవాలన్న చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. ఏది తినాలో, ఏది తినకూడదు మదన పడిపోతూ ఉంటారు. అలాగే ఈ షుగర్ కంట్రోల్ లో ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా చాలామందికి తెలియదు. అలాంటివారికి పెసరపప్పుతో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. పెసరపప్పు దీనిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అయితే కొందరు మాంసాహారం తినని వారికి ప్రోటీన్ అందక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పప్పుని ఆహారంలో చేర్చుకోవడం వలన ప్రోటీన్ లోపం తగ్గిపోతుంది. అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
ఈ పెసరపప్పులో మినరల్స్ ,విటమిన్స్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పప్పు మన ఆరోగ్యానికి ఎంతో లాభదాయకం. కొన్ని రకాల పప్పులు, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, చిక్కుడు పప్పు, ఎర్ర కందిపప్పు లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటన్నిటికంటే పెసరపప్పులో ప్రత్యేకమైన పోషకాలు ఉంటాయి. దీనిని ఆయుర్వేదంలో మూంగ్ దాల్, క్వీన్ ఆప్ పల్సర్ అని పిలుస్తుంటారు. దీనిలో ఐరన్, పొటాషియం, విటమిన్ b6, పోలేట్ ,నియాసిన్ కూడా ఉంటాయి. అందుకే ఈ పెసరపప్పును నిత్యము డయాబెటిస్ పేషెంట్లు తీసుకున్నట్లయితే వారి షుగర్ కంట్రోల్ అవ్వడమే కాకుండా వాళ్ళకి మంచి ప్రోటీన్ అందుతుంది. అలాగే ఎన్నో అనారోగ్య ఇబ్బందుల నుండి కూడా ఉపశమనం కలిగించుకోవచ్చు అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పప్పు సులభంగా జీర్ణమవుతుంది. తక్కువ మోతాదులు గ్యాస్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పప్పుని వండుకునే ముందు నానబెట్టి వండుకోవడం అనేది మంచిదని తెలియజేస్తున్నారు.
దీనిలో ఉండే పైటిక్ యాసిడ్ నానబెట్టడం వల్ల తొలగిపోయి చాలా ఈజీగా జీర్ణం అవుతుంది అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. షుగర్ బాధితులకు ఈ పెసరపప్పు నిత్యము ఆహారంలో చేర్చుకున్నట్లైతే.. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఈ పెసరపప్పులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయాటిక్ గుణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. అలాగే శరీరంలో అధిక కొవ్వుని కూడా కరిగిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే శరీరంలో నొప్పిని, మంటని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఆర్థరైటిస్ తో ఇబ్బంది పడేవారు ఈ పెసరపప్పుని నిత్యము తీసుకున్నట్లయితే దాని నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.