Summer : వేసవికాలం కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారా.. బాడీ తడిసిపోవడం ఖాయం..!
ప్రధానాంశాలు:
Summer : వేసవికాలం కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారా.. బాడీ తడిసిపోవడం ఖాయం..!
Summer : వేసవికాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. ఎండలో బయట తిరిగితే మాత్రం కచ్చితంగా బాడీ డీ హైడ్రేట్ కు గురవుతుంది. దాని వల్ల చాలానే ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటారు. అయితే ఈ ఎండాకాలం చాలామంది కొన్ని డ్రింక్స్ ను తాగేస్తుంటారు. కానీ వాటిని తాగితే మరింత చెమట రావడంతో పాటు బాడీ డీ హైడ్రేట్ కు గురవుతుందని చెబుతున్నారు డాక్టర్లు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Summer : స్పైసీ ఫుడ్
చాలామందికి స్పైసీ ఫుడ్ ను తినడం అంటే ఎంతో ఇష్టం. అయితే వేసవికాలంలో స్పైసీ ఫుడ్ ను తింటే ఎక్కువగా చెమటలు వస్తుంటాయి. కారం ఎక్కువగా ఉండే తిండి వల్ల ఇలాగే చెమటలు పడుతుంటాయి. పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలతో తయారు చేసిన వంట తినడం మానుకోవాలి. వీటిని తిన్న తర్వాత చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. దాని వల్ల బాడీ మొత్తం చెమట వాసన వస్తుంది.
Summer : కాఫీ
కాఫీ తాగకుండా చాలామంది ఉండలేరు. అయితే కాఫీ తాగకపోతేనే చాలా బెటర్ అని చెబుతున్నారు డాక్టర్లు. ఎందుకంటే కాఫీలో కెఫెన్ అనే పదార్థం ఉంటుంది. అది అడ్రినల్ గ్రంథులను బాగా యాక్టివ్ చేస్తుంది. దాంతో బాడీ మొత్తం చెమట వచ్చేస్తుంది. కాబట్టి చెమటను తగ్గించుకోవడానికి కాఫీకి దూరంగా ఉంటేనే బెటర్.

Summer : వేసవికాలం కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారా.. బాడీ తడిసిపోవడం ఖాయం..!
Summer : ఆల్కహాల్
ఆల్కహాల్ తాగకుండా చాలామంది ఉండలేరు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో అయితే ఎక్కువగా బీర్లు తాగేస్తుంటారు. కానీ ఇలా మద్యం తాగితే బాడీ మొత్తం డీహైడ్రేట్ అవుతుంది. దాంతో పాటు బాడీలో హీట్ పెరుగుతుంది. అందుకే ఎండాకాలంలో మద్యం సేవించడం మానుకోవాలి.
Summer : సోడా
సోడా తాగితే బాడీకి వేసవి నుంచి ఉపశమనం లభిస్తుందని అనుకుంటారు. కానీ సోడాలు తాగడం వల్ల చెమటనే ఎక్కువగా ఉవస్తుంది. ఎందుకంటే ఇది బాడీలోని చెక్కర స్థాయిలను కూడా పెంచుతుంది. కాబట్టి వేసవిలో కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే బెటర్.
Summer : చక్కెర ఆహారాలు
తీపి, చల్లని డ్రింక్స్ తాగినా సరే చెమట పడుతుంది. ఇన్సులిన్ హార్మోన్ పనితీరు కూడా బాగా చెడిపోతుంది. అంతే కాకుండా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా బాగా పెరిగిపోతాయి. కాబట్టి వేసవి కాలంలో వీటికి దూరంగా ఉండాలి.