Eating : ఓరి దేవుడో… దీని గురించి ఎప్పుడైనా విన్నారా..? ఒకరోజు మొత్తం ఆహారం తినకపోతే జరిగేది ఇదే…!
ప్రధానాంశాలు:
Eating : ఓరి దేవుడో... దీని గురించి ఎప్పుడైనా విన్నారా..? ఒకరోజు మొత్తం ఆహారం తినకపోతే జరిగేది ఇదే...!
Eating : ప్రస్తుతం మా దయనందన జీవితంలో కొన్ని అనారోగ్య కారణాల వలన చాలామంది అన్నం తినడం మానేస్తూ ఉన్నారు. కొంతమంది రోజంతా పూర్తిగా ఆహారం తినడం మానేస్తూ ఉంటారు.. అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా.. అదే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆకలితో ఉండడం భరించలేని అనుభవం మాత్రమే కాదు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం కావున సరైన సమయంలో అల్పాహారం తీసుకోవడం మధ్యాహ్నం భోజనం రాత్రికి డిన్నర్ చేయడం శరీరానికి చాలా అవసరం. ఎక్కువ గంటల పాటు మనం ఆహారం తినకపోతే మన కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువ ఆలస్యమైతే మనకి ఏ పని చేయాలని అనిపించదు. దాంతో మన చూపు ఆహారం వైపు వెళుతుంది.
ఏది దొరికితే అవి తినాలనిపిస్తుంది. అయితే 24 గంటలు పైగా ఆకలితో ఉంటే మీ ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం పడుతుందో తెలుసా..? వ్యక్తిత్వం పై ఎఫెక్ట్: మీకు 24 గంటలు ఆహారం లభించినప్పుడు మీరు సహజ పరిస్థితుల్లో లాగా ఉండలేరు. అలాంటి పరిస్థితుల్లో వ్యక్తులతో మీ ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మీ వ్యక్తిత్వంలో మార్పుని చూస్తారు..
శక్తి లేకపోవడం: ఎక్కువసేపు ఆకలితో ఉండడం వలన మీ శరీరానికి పూర్తి శక్తి అందదు. దాని వలన మీ కండరాలు అలసిపోయినట్లు అవుతాయి.అలాగే మీరు బలహీనంగా అవుతారు
పని సామర్థ్యం పై ప్రభావం: రోజంతా ఆకలితో ఉండడం వల్ల మీ ఏకాగ్రత సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది మీ పని సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలు: రోజంతా ఆకలితో ఉండడం వల్ల గ్యాస్ పొత్తికడుపులో యాకోచం ఎసిడిటీ లాంటి జీర్ణ సమస్యలు వస్తాయి మీ కడుపులో అసౌకర్యం నొప్పిని కలిగిస్తుంది. మీ శారీరిక ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంది.
మానసిక ఆరోగ్యం పై ప్రభావం : ఎక్కువసేపు ఆకలితో ఉండడం మానసిక ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది. అలసట, చిరాకు, డిప్రెషన్, ఆందోళన లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది మన జీవిత నాణ్యతను మార్చగలదు. మంచి సామాజిక వృత్తిపరమైన జీవితము సమతుల్యతను దెబ్బ కొడుతుంది.