Sugarcane Juice : ఎండవేడికి తట్టుకోలేక చెరుకు రసం తాగుతున్నారా… ఇవి కచ్చితంగా తెలుసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sugarcane Juice : ఎండవేడికి తట్టుకోలేక చెరుకు రసం తాగుతున్నారా… ఇవి కచ్చితంగా తెలుసుకోండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :26 March 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Sugarcane Juice : ఎండవేడికి తట్టుకోలేక చెరుకు రసం తాగుతున్నారా...ఇవి కచ్చితంగా తెలుసుకోండి...!

Sugarcane Juice : వేసవికాలం రానే వచ్చింది. అప్పుడే ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అయితే ఈ వేసవికాలం నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ వేసవి తాపం నుండి మన శరీరాన్ని కాపాడుకోవడానికి మన శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా ఉండడానికి వివిధ రకాల జ్యూసులు తాగుతూ ఉంటారు. దీనిలో భాగంగానే చాలామంది ఎండలో ఉపశమనం కోసం చెరుకు రసాన్ని ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఈ చెరుకు రసంలో మెగ్నీషియం ,మాంగనీస్ , జింక్, ఐరన్ ,కాల్షియం పొటాషియం వంటి వివిధ రకాల పోషకలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే మన శరీరానికి ఈ పోషకాలు చాలా అవసరం అని చెప్పాలి. కానీ వేసవికాలంలో చెరుకు రసాన్ని ఎక్కువగా తాగటం ప్రమాదకరమని వైద్య నిపుణులు అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే వేసవికాలంలో అతిగా చెరుకు రసం తాగడం వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వారు తెలియజేస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చెరుకు రసం తాగడం వలన మన శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ తాజాగా వెళ్లడైన కొన్ని అధ్యయనాల ప్రకారం అతిగా తాగటం అంత మంచిది కాదని వెళ్లడైంది. తాజాగా నిర్వహించిన కొన్ని అధ్యయనాల ప్రకారం చేరకు రసంలో కేలరీలు ఎక్కువగా ఉన్నాయని వెళ్లడైంది. ఒక గ్లాస్ చెరుకు రసంలో దాదాపు 250 గ్యాలరీలు అలాగే 100 గ్రాములు చక్కెర ఉంటుందట. తద్వారా ప్రతిరోజు చెరుకు రసం తాగటం వలన మనం అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

చెరుకు రసంలో అధిక క్యాలరీలు మరియు చక్కర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందట. కావున వేసవికాలంలో వీలైనంత తక్కువ చెరుకు రసం తాగటం మంచిదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులతో పంచుకోండి.గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది