Dry Fruits : ఈ డ్రైఫ్రూట్స్ తో మీ ఎముకలు దృఢంగా, ఉక్కులా మారుతాయి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dry Fruits : ఈ డ్రైఫ్రూట్స్ తో మీ ఎముకలు దృఢంగా, ఉక్కులా మారుతాయి..!

Dry Fruits : మనం ఏ పని చేయాలన్నా మన కాళ్లు, చేతులు శరీర అవయాలు సరిగ్గా పనిచేస్తేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం.. మన ఎముకలు బలహీన పడితే మనం ఏ పని చేయలేము.. మన శరీరం బలహీన పడుతుంది. అంటే మన ఎముకలకి కాల్షియం చాలా అవసరం. క్యాల్షియం పుష్కలంగా ఉంటేనే మనం దృఢంగా ఉండగలం. ఎముకలకు కాల్షియం చాలా అవసరం. అంతే కాదు కండరాల ఎముకల దృఢత్వానికి క్యాల్షియం చాలా అవసరం. అంతే […]

 Authored By jyothi | The Telugu News | Updated on :30 December 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  Dry Fruits : ఈ డ్రైఫ్రూట్స్ తో మీ ఎముకలు దృఢంగా, ఉక్కులా మారుతాయి..!

Dry Fruits : మనం ఏ పని చేయాలన్నా మన కాళ్లు, చేతులు శరీర అవయాలు సరిగ్గా పనిచేస్తేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం.. మన ఎముకలు బలహీన పడితే మనం ఏ పని చేయలేము.. మన శరీరం బలహీన పడుతుంది. అంటే మన ఎముకలకి కాల్షియం చాలా అవసరం. క్యాల్షియం పుష్కలంగా ఉంటేనే మనం దృఢంగా ఉండగలం. ఎముకలకు కాల్షియం చాలా అవసరం. అంతే కాదు కండరాల ఎముకల దృఢత్వానికి క్యాల్షియం చాలా అవసరం. అంతే కాదు కండరాలు నరాల వ్యవస్థ సరిగ్గా పని చేయాలంటే క్యాల్షియం అవసరం చాలా ఉంటుంది అయితే ఏ ఏ పదార్థాల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఈ సమస్యకి ఉపశమనం కలిగించవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

అంజీర ఫ్రూట్ : ఈ అంజీర ఫ్రూట్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ అంజిరాలో 100 గ్రాముల అంజిరాలో 55 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. దీనిని తినడం వలన రక్తం లేని సమస్య దూరమవుతుంది. కాలుష్యం లోపం కారణంగా ఇబ్బంది పడేవారు ఈ అంజీరా ని రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు..

జీడిపప్పు : జీడిపప్పులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు దృఢత్వానికి సహాయపడుతుంది. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పు బరువు తగ్గడానికి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

నువ్వులు : నువ్వులు ఎముకలకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే ఐరన్ మెగ్నీషియం లాంటి ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మీ ప్రతిరోజు ఆహారంలో వీటిని చేర్చుకుంటే మీ ఎముకలు ఉక్కులా మారుతాయి.

క్యాల్షియం అనగానే ముందుగా పాలే గుర్తుకొస్తాయి.పాలు సులభంగా జీర్ణం అవ్వడమే కాకుండా శరీరం త్వరగా గ్రహిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కప్పు పాలు తీసుకుంటే 250 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఒక ఆరెంజ్ తీసుకుంటే 60 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ డి కూడా ఉండడం వల్ల క్యాల్షియంను శరీరం త్వరగా గ్రహిస్తుంది. ఒక కప్పు సోయా మిల్క్ లో 60 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. క్యాల్షియంతో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. ఒక కప్పు బాదం లో 457 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. క్యాల్షియం ఎక్కువగా లభించే ఆహార పదార్థాల్లో ఇది టాప్ లిస్టులో ఉంటుంది.

ప్రోటీన్స్ కూడా తగినంతగా లభిస్తాయి. జ్ఞాపక శక్తిని పెంచే గుణం ఉంటుంది. గుండె జబ్బుల రిస్కులు తగ్గిస్తుంది. రోజులో ఒకసారి పెరుగు వేసుకున్న 400 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. పాలకు బదులుగా పెరుగు తీసుకున్న తగినంత కాల్షియం లభిస్తుంది. ఇక జున్నులో క్యాల్షియంతో పాటు ప్రోటీన్లు కూడా ఎక్కువగా లభిస్తాయి. ఒక కప్పు జున్ను తీసుకుంటే 950 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది