Eat Soaked Dates : ఉదయం పరగడుపున నానబెట్టిన ఖర్జూరాలు ఎప్పుడైనా తిన్నారా… తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రధానాంశాలు:
Eat Soaked Dates : ఉదయం పరగడుపున నానబెట్టిన ఖర్జూరాలు ఎప్పుడైనా తిన్నారా... తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
Eat Soaked Dates : ఆధార్నంగా పరగడుపున కొన్ని పదార్థాలు తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయి. పదార్థాలలో ఒకటైనది డైట్. ఈ డైట్లో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు కొన్ని ఉన్నాయి. అలాంటి పదార్థాలే ఖర్జూరాలు. శరీరానికి శక్తిని ఇవ్వడమే కాదు పోషకాలను అందించే ఔషధగని. రాత్రి నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు…
Eat Soaked Dates : ఉదయం పరగడుపున నానబెట్టిన ఖర్జూరాలు ఎప్పుడైనా తిన్నారా… తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
Eat Soaked Dates ఖర్జూరాలతో ఆరోగ్య ప్రయోజనాలు
ఖర్జూరాలలో ఫైబర్,విటమిన్ బి సమూహాలు. (B1,B2,B3,B5 ), విటమిన్ A,C అలాగే ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, మ్యాంగనీస్,రాగి వంటి ఖనిజాల పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. నానబెట్టిన ఖర్జూరాలు తింటే కలిగి ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఖర్జూర లో, ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. నానబెట్టిన ఖర్జూరాలు తింటే పేగులు పనితీరు బాగుంటుంది. మలబద్ధకం రాకుండా సహకరిస్తుంది. ఇందులో ఉన్న ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అనీమియా సమస్యను తగ్గిస్తుంది. అలసట ఉండేవారు ఖర్జూరాలను తింటే శక్తిని పొందవచ్చు.
విటమిన్ సి,సెలీనియం వంటి పోషకాలు మన శరీర రక్షణ వ్యవస్థ పనితీరుకు చాలా అవసరం. రోజు ఉదయాన్నే పరిగడుపున నానబెట్టిన ఖర్జూరాలను తింటే, వైరస్లు,బ్యాక్టీరియా వంటి అలవాటు ఇన్ఫెక్షన్ లు దరిచేరవు. నానబెట్టిన ఖర్జూరాలతో ఉన్న మెగ్నీషియం,రాగి,మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఎముకలు బలంగా ఉండడానికి అవసరం. వృద్ధాప్యంలో అస్టియో పోరోసిస్ రాకుండా ఉండాలంటే ముందుగానే ఖర్జూరాలు ఆహారంలో చేర్చడం మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షిస్తుంది. మతిమరుపు,అల్జీమర్స్ వంటి నరాల సమస్యను కూడా తగ్గించే దివ్య ఔషధం.
నానబెట్టిన ఖర్జూరాలలో ఉండే పోషకాలు,చర్మ కణాల పునరుత్పత్తికి తోడ్పడుతుంది. శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరిచి చర్మాన్ని కాంతివంతంగా చేసి శరీరానికి శక్తిని అందిస్తుంది. రాత్రి సమయంలో మూడు నుండి నాలుగు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తింటే చాలా మంచిది. నానబెట్టిన నీటిని కూడా తాగవచ్చు. ఇది శరీరాన్ని డిటాక్స్ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.