Polished Rice : పాలిష్ చేసిన బియ్యాన్నే ఎక్కువగా తింటున్నారా? మీ ఆరోగ్యాన్ని మీరే ఎలా పాడుచేసుకుంటున్నారో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Polished Rice : పాలిష్ చేసిన బియ్యాన్నే ఎక్కువగా తింటున్నారా? మీ ఆరోగ్యాన్ని మీరే ఎలా పాడుచేసుకుంటున్నారో తెలుసా?

Polished Rice : ఈరోజుల్లో ఎక్కుమంది తినేది ఏంటి.. అన్నం. అవును.. మూడు పూటలా అన్నం తప్పితే చాలామంది ఇంకేం తినరు. కొందరికి అన్నం తినకపోతే అస్సలు ఏం తిన్నట్టు ఉండదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే అన్నాన్నే ఎక్కువగా తింటారు. చపాతీలు, రొట్టెలు ఎక్కువగా తినరు. సాధారణంగా మంచి బియ్యాన్ని తింటే సమస్య లేదు కానీ.. ప్రస్తుతం మార్కెట్ లో దొరికేది పాలిష్ బియ్యం కదా. బియ్యాన్ని పాలిష్ చేసి సన్నగా చేసి వాటిని […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :18 February 2022,7:40 am

Polished Rice : ఈరోజుల్లో ఎక్కుమంది తినేది ఏంటి.. అన్నం. అవును.. మూడు పూటలా అన్నం తప్పితే చాలామంది ఇంకేం తినరు. కొందరికి అన్నం తినకపోతే అస్సలు ఏం తిన్నట్టు ఉండదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే అన్నాన్నే ఎక్కువగా తింటారు. చపాతీలు, రొట్టెలు ఎక్కువగా తినరు. సాధారణంగా మంచి బియ్యాన్ని తింటే సమస్య లేదు కానీ.. ప్రస్తుతం మార్కెట్ లో దొరికేది పాలిష్ బియ్యం కదా. బియ్యాన్ని పాలిష్ చేసి సన్నగా చేసి వాటిని మార్కెట్ లో అమ్ముతుంటారు.ఈ రైస్ చూడటానికి తెల్లగా.. సన్నగా కనిపించేసరికి.. చాలామంది ఈ రైస్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటినే మూడు పూటలా మెక్కుతున్నారు. ఈ రైస్ ను తినడం వల్ల ఏమౌతుందో తెలిస్తే జన్మలో కూడా ఈ బియ్యాన్ని తినరు.

ఎందుకో తెలుసా.. ఈ బియ్యాన్ని ఎక్కువగా తినడం వల్ల షుగర్ వస్తుంది. షుగర్ తో పాటు స్థూలకాయం కూడా వస్తుంది.ఈరోజుల్లో షుగర్, స్థూలకాయం అనేవి ఎంత డేంజరో తెలుసు కదా. ముఖ్యంగా షుగర్ అయితే ప్రతి 10 మందిలో ఐదారుగురికి వస్తుంది. దానికి కారణం మనం ఎక్కువగా తినే అన్నమే. వెనకట మన తాతలు.. ముత్తాతలు ఇలా పాలిష్ చేసిన బియ్యాన్ని తినలేదు. వాళ్లు కేవలం గటక, జొన్నలతో చేసిన అన్నం తినేవారు. లేదంటే రాగి సంగటి తినేవారు.కానీ.. మనం ఇప్పుడు కేవలం పాలిష్ చేసిన బియ్యాన్నే తింటున్నాం. దాంట్లో కార్బోహైడ్రేట్స్ తప్పితే అస్సలు ప్రొటీన్స్ ఉండవు. బియ్యంలో ఉండే ప్రొటీన్స్ మొత్తం పాలిష్ చేయడం వల్ల పోతాయి. మిగిలేది పిండిపదార్థాలు మాత్రమే.

eating polished rice regularly may increase risk of type 2 diabetes

eating polished rice regularly may increase risk of type 2 diabetes

Polished Rice : పాలిష్ చేసిన బియ్యాన్ని కాకుండా ఏం తింటే షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు

అందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల శరీరంలో షుగర్ లేవల్స్ పెరిగిపోయి డయాబెటిస్ కు దారి తీస్తుంది.పాలిష్ బియ్యం తినడం మానేసి.. వీలైనంతగా ఇతర ఆహారాల వైపు మొగ్గు చూపాలి. అన్నం ఎక్కువగా ఇష్టపడేవాళ్లు.. బ్రౌన్ రైస్ తినొచ్చు. లేదంటే సిరి ధాన్యాలు తినొచ్చు. జొన్నలు, రాగులతో చేసిన ఆహారాన్ని మెల్లగా అలవాటు చేసుకుంటే డయాబెటిస్ ముప్పును తగ్గించుకోవచ్చు.జొన్నలతో చేసిన రొట్టెలు, చపాతీలు, గటక, రాగి సంకటి లాంటివి ఎక్కువగా తినడం అలవాటు చేసుకోవడం మంచిది. దాని వల్ల.. స్థూలకాయం కూడా తగ్గించుకోవచ్చు.

Also read

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది