Health Benefits : ఈ గింజలు తింటే బాడీ రీ ఫ్రెష్.. ఈ కాయతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
Helth Benefits : గుమ్మడిలో అద్భుత ఔషధాలున్నాయి. దీనితో ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. ఇవి గ్రామాల్లో విరివిగా దొరుకుతాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం గుమ్మడికాయను పవిత్రంగా భావిస్తారు. ఎక్కువగా పూజలో గుమ్మడికాయను కొడతారు. ఇంట్లో గుమ్మాల ముందు, అలాగే పలు నుతన కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు ఎక్కువగా వాడతారు. గుమ్మడికాయ గింజల్లో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ కే, ఒమేగా-3 , బీటా కెరోటిన్, భాస్వరం, మెగ్నీషియం, రాగి, ఇనుము, పొటాషియం లాంటి ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఈ పోషకాలు రోగనిరోధక శక్తినికూడా పెంచుతాయి.ఇందులో ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుంది, శరీరానికి తక్కువ కేలరీలు అందిస్తుంది. కళ్లకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సీ కుడా పుష్కలంగా లభిస్తుంది. డయాబెటీస్ రాకుండా ఉండేందుకు, వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది. బీపీని నియంత్రిస్తుంది. పీచు పదార్ధము ఎక్కువగా ఉన్నందున కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్లలో కలిపి తాగితే మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.గుమ్మడికాయల్లో ఫైబర్, పొటాషియం కూడా ఎక్కువే. అందుకే వీటిని కాన్సర్ పేషెంట్ల ఆహారంలో చేర్చారు.
Health Benefits : గుమ్మడి గింజల్లో అద్భుత ఔషదాలు
చాలా మంది డయాబెటిస్‌తో బాధపడేవారికి బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండవు. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు గుమ్మడి గింజలు తింటే మాత్రం ఫలితం ఉంటుంది.గుమ్మడికాయే కాకుండా గుమ్మడి గింజల్లో కూడా బోలెడన్ని ఖనిజాలు ఉంటాయి. కొలెస్టరాల్ మాదిరిగా వృక్షస్టెనాల్స్ కూడా ఎక్కువే లభిస్తాయి. ఇవి మంచి కొవ్వు స్థాయిలు పెరిగేలా చేస్తాయి. గుమ్మడిలో పీచు ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉన్నాయి. ఇలా ఇది త్వరగా ఆకలి వేయకుండా, బరువు పెరగకుండా చూస్తుంది. పీచుతో మలబద్ధకం కూడా దూరమవుతుంది. గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరటోనిన్ అనే రసాయనం ఉత్పత్తి కావటానికి తోడ్పడుతుంది. సెరటోనిన్ నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.