Raisins : ఎండు ద్రాక్ష తినే ప్రతి ఒక్కరు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raisins : ఎండు ద్రాక్ష తినే ప్రతి ఒక్కరు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి…!

 Authored By aruna | The Telugu News | Updated on :30 September 2023,12:00 pm

Raisins : ఆరోగ్యంగా ఉండడానికి మీరు డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్ గా తింటున్నారా.. అయితే ద్రాక్ష అలాగే క్రిస్మస్ తినేటప్పుడు ఎలా తింటున్నారు.. ఎన్ని తింటున్నారు.. అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఎలాంటివి తింటే మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.. వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.? కొనేటప్పుడు ఎలాంటివి చూసి కొనుక్కోవాలి. ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం..ఎండుద్రాక్ష లో చాలా రకాల స్వీట్స్ లో వాడుతుంటారు. అయితే వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.. నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్షను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు ఉంటాయి. ఒక గ్లాసులో ఎనిమిది లేదా పదిహేను ద్రాక్షాలు వేసి నానబెట్టండి. వీటిని ఉదయాన్నే మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో వేసి పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.

ఎండు ద్రాక్ష లో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాదు నేచురల్ షుగర్ అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ మీరు తీపి వద్దు అనుకున్నప్పుడు ఇలాంటి ఎండు ద్రాక్షాలు లేదా కిస్మిస్ ని మీ వంటల్లో వేసుకుంటే మరి షుగర్ గాని ఎటువంటి వాడాల్సిన పని కూడా ఉండదు. అలాగే ఎండు ద్రాక్షలో మనకి తెలిసినవి కొన్ని రకాలు అయితే చాలా రకాలు ఉంటాయి అంట. వాటిలో ముఖ్యంగా గోల్డెన్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి ఇంకొన్ని బ్లాక్ కలర్ లో కూడా ఉంటాయి. అయితే ఎండు ద్రాక్షలో క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటిని తక్కువ తీసుకోవాలి. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎక్కువగా తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి. ఎండు ద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

Every Raisin Eater Must Know These Things

Every Raisin Eater Must Know These Things

కాబట్టి జీర్ణశక్తి పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇలా నానబెట్టడానికి ముందు కొంచెం వాష్ చేసి నానబెట్టండి. ఎందుకంటే మనం ఈ ఎండు ద్రాక్షతోపాటు ఈ నానబెట్టుకున్న నీటిని కూడా తాగాలి. కాబట్టి ఉదయాన్నే మీరు ఎందుకు ద్రాక్షాను బ్రష్ చేసుకున్న తర్వాత పరగడుపున చక్కగా నమిలి తినండి. ఆ తర్వాత ఈ వాటర్ తాగండి. ఇలా మీరు నమిలి తినడం ఇష్టం లేకపోతే మిక్సీలో వేసి పేస్టులా చేసుకుని ముందుగా చెప్పుకున్నట్టు వాటర్ లో వేసుకుని కూడా తాగేయొచ్చు. ఎండు ద్రాక్షలో ఉండే ఆంటీ బ్యాక్టీరియా లక్షణాలు బాడ్బ్రీయులకు తొలగించడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అంటే ఎవరికైతే నోటి దుర్వాసన ఎక్కువ ఉంటుందో సమస్యలతో ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు ఇలా ఎండు ద్రాక్షాలు తినడం అలవాటు చేసుకుంటే నోటి దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో ఈ ఎండు ద్రాక్ష అద్భుతంగా సహాయపడుతుంది.

సుల్తాన్ ఎండు ద్రాక్షాలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఫైబర్ పొటాషియం, ఐరన్ బట్టి అనేక ఖనిజాలు ఉంటాయి. మీరు కచ్చితంగా వీటిని ఆహారంలో అయితే చేర్చుకోండి. అయితే మీరు అధిక పరిమాణంలో ఎండు ద్రాక్ష మాత్రం తినకూడదు. ఎలా తీసుకున్నా గాని వీటిని డైరెక్టుగా అయితే తినకూడదు. గుర్తుంచుకోండి. ఎండుద్రాక్షను ఎప్పుడు తిన్నా రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే పరగడుపునే తినాలి…

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది