Raisins : ఈ డ్రై ఫ్రూట్స్ ను రోజుకు ఎన్ని తీనాలి… దాంతో కలిగే ప్రయోజనాలు ఏంటి…??
ప్రధానాంశాలు:
Raisins : ఈ డ్రై ఫ్రూట్స్ ను రోజుకు ఎన్ని తీనాలి... దాంతో కలిగే ప్రయోజనాలు ఏంటి...??
Raisins : ప్రస్తుత కాలంలో మనం ఆరోగ్యం కోసం ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉన్నాం. అయితే వాటిల్లో ఒకటి రెండు ద్రాక్ష. ఇది కూడా ఒక డ్రై ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఈ డ్రై ఫ్రూట్ అనేది రుచికరమైనది మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే చలికాలంలో దీని వాడకం వలన ఎన్నో రకాల వ్యాధుల నుండి బయటపడవచ్చు. అయితే ఈ ఎండు ద్రాక్షలో ఐరన్ మరియు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, విటమిన్ b6 లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అయితే ఈ ఎండు ద్రాక్షలను ఒక రోజులో ఎన్ని తీసుకోవాలి.? దాని వలన కలిగే లాభాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
శరీరం అనేది శక్తి హీనంగా ఉన్నవారికి ఎండు ద్రాక్ష ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటుగా ఎముకలను కూడా ఎంతో బలంగా చేస్తుంది. అయితే ఈ ఎండు ద్రాక్షాను రాత్రంతా నీళ్లలో నానబెట్టుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఇది శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది. అయితే ఈ ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ మితంగా తీసుకుంటే మాత్రమే దాని ప్రయోజనాలు అందుతాయి. అలాగే ఏదైనా సరే అతిగా తీసుకుంటే దాని వలన మీకు ఎక్కువగా హాని కలుగుతుంది. అలాగే ఈ ఎండు ద్రాక్షాలో చక్కెర మరియు కేలరీల పరిమాణం కూడా చాలా అధికం. ఇలాంటి పరిస్థితులలో వాటిని అధికంగా తీసుకోవడం వలన కేలరీల పరిమాణం పెరుగుతుంది. అయితే ఈ ఎండు ద్రాక్షాను రోజుకు 30 నుండి 60 గ్రాముల వరకు మాత్రమే తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అంతకుమించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి అని అంటున్నారు.
ఎండుద్రాక్షను తినడం వలన మలబద్ధక సమస్య కూడా తొందరగా తగ్గిపోతుంది. అలాగే మలబద్ధక సమస్య తో ఇబ్బంది పడేవారు ఎండు ద్రాక్షాను తీసుకోవడం వలన ఈ సమస్య నుండి తొందరగా బయటపడవచ్చు. అయితే వీటిని వేడిపాలతో కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. అలాగే బరువు అనేది చాలా తక్కువగా ఉండి, బరువు పెరగాలి అని అనుకునే వారికి ఈ ఎండు ద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది. అయితే వీటిలో తగిన మోతాదులో గ్లూకోజ్ మరియు ప్రక్టోజ్ ఉంటాయి. ఇది బలాన్ని ఇవ్వటమే కాక దీనిలో ఉన్నటువంటి మూలకాలు బరువును పెంచడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ ఎండుద్రాక్ష లో సరైన మోతాదులో ఇనుము కూడా ఉంటుంది. అంతేకాక దీనిలో విటమిన్ బి కాంప్లెక్స్ కూడా సరైన మోతాదులో ఉంటుంది. అంతేకాక రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా వీటిని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది