Eye Sight Problems : మీరు ఈ డైట్ పాటిస్తే కంటి చూపు సమస్యలకి చెక్ పెట్టవచ్చు..!!
Eye Sight Problems : చిన్న వయసులో కూడా కంటి చూపు సమస్యలతో ఎంతో సతమతమవుతూ ఉన్నారు.. వీటికి కారణాలు మనం జీవిస్తున్న జీవనశైలి లో ఎన్నో పొరపాట్లు వలన ఈ సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయి.. కళ్ళు అనేవి ఎంతో ప్రధానమైనవి.. వీటిని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి. కంటి సమస్యలు వస్తే ఇక జీవితం అంత చీకటిమయం అవుతుంది. ఈ రోజుల్లో చిన్నారుల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు డిజిటల్ ప్రపంచంలో మునిగిపోవడం వలన ఈ కంటి సమస్యలు కళ్లద్దాలు వస్తున్నాయి.. ప్రధానంగా కళ్ళ ఆరోగ్యానికి ఈ గార్జిట్లు చాలా డేంజర్ అని తేలింది. వాటి స్క్రీన్ లైట్ మన కళ్ళకి ఎంతో ప్రమాదకరం. వాటి వలన అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఇటువంటి చెడు జీవన శైలి కారణంగా మన కళ్ళు బలహీనంగా మారుతున్నాయి.
కళ్ళలో దురద, మంట లాంటి సమస్యలు మొదలై కంటి చూపు మందగిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే… సిట్రస్ ఫ్రూట్స్ : సిట్రిక్ యాసిడ్ నారింజ విటమిన్ సి నిమ్మ ,ద్రాక్ష పండు, జామపండులో అధికంగా ఉంటాయి. విటమిన్ సి కళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే వాల్నట్స్ ,బాదం లాంటి డ్రై ఫ్రూట్స్ కంటి చూపుని మెరుగుపడేలా చేస్తాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ నిత్యం తీసుకోవాలి. దీంతో కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.. ఆకు కూరలు: కంటి చూపు మెరుగుపడాలంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పచ్చి కూరగాయలు కంటికి చాలా ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి అధికంగా ఉంటాయి. ఆంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ లాంటి అంశాలను కంటి చూపుని మెరుగుపరుస్తాయి..

ఉసిరి : కళ్ళకు ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. అలాగే జామకాయ పొడి, మరమలాడు, ఊరగాయ, ఉసిరి మిఠాయి ఇలాంటి జామకాయతో చేసిన పదార్థాలను తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఈ ఉసిరికాయని నిత్యం తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అవకాడో : అవకాడోలు విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. దీనిని తినడం వలన కంటి రెటేనా మెరుగుపడుతుంది. మీ కళ్ళు వృద్ధాప్యం వరకు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే క్యారెట్లులలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి చూపుని అధికం చేస్తుంది. క్యారెట్ లో ఉండే విటమిన్ ఏ కళ్లకు కూడా చాలా సహాయపడుతుంది.