Eyesight : కంటి చూపు పెరగాలంటే వెంటనే ఇలా చేయండి చాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eyesight : కంటి చూపు పెరగాలంటే వెంటనే ఇలా చేయండి చాలు…!

 Authored By aruna | The Telugu News | Updated on :18 February 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Eyesight : కంటి చూపు పెరగాలంటే వెంటనే ఇలా చేయండి చాలు...!

Eyesight : సర్వేంద్రియానామ్ నయనం ప్రధానం అన్నారు మన పెద్దలు. కంటి చూపు బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలం. పూర్వం రోజులలో కొంచెం వయసు వచ్చాక కళ్ళజోడు అవసరమయ్యేది.. కానీ ప్రస్తుతం రోజుల్లో చిన్న వయసులోనే పిల్లలకు కళ్లద్దాలు అవసరమవుతున్నాయి. దీనికి మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు ప్రధాన కారణం. శరీరానికి సరిగ్గా విటమిన్లు అందకపోవడం వలన కంటి చూపు మందగిస్తుంది. ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మీ కంటి చూపు వేగంగా మెరుగుపడడమే కాక నెల రోజుల్లోనే మీ కళ్ళద్దాలు తీసి పక్కన పడేస్తారు. అంత ఎఫెక్ట్ ఈ చిట్కాలు పనిచేస్తాయి.కంటి చూపు పెరుగుదలకు కరివేపాకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దీంట్లో బీటా కేరోటి పుష్కలంగా ఉంటుంది.ఇది మీ కంటి చూపు మెరుగు పడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కంటి చూపు మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే మన పెద్దలు పూర్వ రోజుల్లో ఇంటి పెరట్లో కరివేపాకు చెట్టును తప్పకుండా పెంచేవారు.కర్వేపాకు ను ఆహారంలో భాగం చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ కంటి చూపు మెరుగుపడుతుంది. అలానే కరివేపాకుతో పాటు కొత్తిమీర, మునగాకు, పాలకూరల్లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. కరివేపాకు నచ్చని వారు ఈ ఆకుకూరలను వారానికి ఒక్కసారి అయినా ఆహారలో ఉండేలా చూసుకోండి. చేపల్లో ఒమేగా త్రీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి చూపు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. వారానికి ఒక్కసారైనా చేపలను ఆహారంగా తీసుకుంటుంటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పడుకునే ముందు ఐదు భాగం గింజలను నానబెట్టి ఉదయాన్నే వాటిని పొట్టు తీసి వాటిని మెత్తగా నూరి దానికి మిరియాల పొడి, పటిక బెల్లం పొడిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమంలో కొంచెం నెయ్యి కలిపి ప్రతి రోజు పరగడుపున క్రమం తప్పకుండా రెండు నెలలపాటు తీసుకుంటే మీకు జీవితంలో కళ్లద్దాలు పెట్టుకునే అవసరమే ఉండదు.

అంత ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. వీటితో పాటు ఉసిరి వంటివి తింటూ ఉండండి.మాంసంలో ఏ విటమిన్ అధికంగా ఉంటుంది. ఒకవేళ మీకు మాంసం తినడం అలవాటు లేకపోయినా మీ కంటి చూపు కోసం అలవాటు చేసుకోండి. అప్పుడప్పుడు రెండు అరచేతులురుద్ది వేడి పుట్టించి వాటిని కనురెప్పల మీద పెట్టుకోండి. దీనివలన కంటి అలసట తగ్గుతుంది. ఉదయం పూట మీ కంటికి సూర్యరశ్మి తగిలెలా చూసుకోండి. మీ పని చేసే చోట వాతావరణం అంతా పచ్చగా ఉండేలా మొక్కలను పెంచుకోండి. పచ్చదనం కంటికి విశ్రాంతినిస్తుంది. తరచూ నీరు తాగడం వలన శరీరంలో వేడి తగ్గడమే కాకుండా కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ కంటి మీద ఎక్కువగా ఒత్తిడి కలిగినప్పుడు తరచుగా శుభ్రమైన నీటితో కళ్ళను వాష్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వలన కళ్ళు రిలీఫ్ ఫీలవుతాయి..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది