Eggs : బాలుడి ప్రాణం తీసిన గుడ్డు… ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Eggs : బాలుడి ప్రాణం తీసిన గుడ్డు… ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు…!

Eggs  : మనకి పోషకాహారం అనగానే చటుకున్న గుర్తొచ్చేది గుడ్లు. కోడి గుడ్డు తింటే బలంగా ఉంటారు అని చాలామంది వైద్యనిపుణులు చెబుతూ ఉంటారు. ప్రతిరోజు గుడ్డు తినమని చెబుతూ ఉంటారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు ఒక గుడ్డు తింటే సరిపోతుందట. దీని నుంచి శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. రోజు రెండు కంటే ఎక్కువ గుడ్లు తినే వాళ్ళు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తేనే మంచిది. ఎందుకంటే వ్యాయామం చేసేవారికి ప్రోటీన్ అవసరం […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 January 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Eggs : బాలుడి ప్రాణం తీసిన గుడ్డు... ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు...!

Eggs  : మనకి పోషకాహారం అనగానే చటుకున్న గుర్తొచ్చేది గుడ్లు. కోడి గుడ్డు తింటే బలంగా ఉంటారు అని చాలామంది వైద్యనిపుణులు చెబుతూ ఉంటారు. ప్రతిరోజు గుడ్డు తినమని చెబుతూ ఉంటారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు ఒక గుడ్డు తింటే సరిపోతుందట. దీని నుంచి శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. రోజు రెండు కంటే ఎక్కువ గుడ్లు తినే వాళ్ళు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తేనే మంచిది. ఎందుకంటే వ్యాయామం చేసేవారికి ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇది గుడ్లనుంచి ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా గుడ్డు లోపల ఉండే పచ్చ సోనలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. ఇందులో విటమిన్ బి టు పుష్కలంగా ఉంటుంది. గుడ్డులోని ప్రోటీన్ రక్తపోటును తగ్గించడానికి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాక దీనిలో విటమిన్ డి6 ఇనుము పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం గుడ్లకు దూరంగా ఉండాలి. ఎవరు తినకూడదు ఎందుకు తినకూడదు అనే వివరాలను తెలుసుకొని ముందు ఈ నిజ సంఘటన చూడండి.. ఒక చిన్నారి తల్లి చేసినటువంటి చిన్నతప్పిదం వల్ల ఆ బిడ్డ ప్రాణం కోల్పోయింది. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా.? ఈ చిన్నారికి ఒక కోడి గుడ్డును ఇచ్చింది అంతే ఆ చిన్నారి ఈ లోకంలో శాశ్వతంగా దూరమైపోయింది.

అలా ఎలా చనిపోతారండి అని చెప్పి మీకు సందేహాము రావచ్చు.. నిజమే ఆరోగ్య కోసమే తల్లి బిడ్డకు కోడి గుడ్డుని ఇస్తుంది. బిడ్డ అది తింటే ఆరోగ్యంగా పుష్టిగా బలంగా తయారవుతాడు కానీ ఇక్కడ బిడ్డ ఎలా చనిపోయాడు. విషయానికొస్తే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా పౌష్టికాహారంతో చక్కగా ఎదుగుదలు ఉండాలని చెప్పి ఆశించిన ఆ తల్లి గుడ్డును ఉడకపెట్టి ఆ బిడ్డ చేతికి ఇచ్చింది. ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు.. సిద్దిపేటలోని దౌర్తాపూర్ గ్రామంలో రమేష్, సంగీత దంపతులకు నేహాలు కి అంగన్వాడీలో ఉడకబెట్టిన గుడ్లను ఇచ్చారు. ఆ గుడ్డు ను పొట్టు తీసి తల్లి వాడికి చక్కగా ఆ గుడ్డును చేతికిచ్చింది. ఇలా ఇచ్చి పని చేసుకోవడానికి వంటింట్లోకి వెళ్ళింది.అంతే అప్పటివరకు ఆడుకుంటున్న బిడ్డ ఎప్పుడైతే తల్లి తన చేతికి కోడి గుడ్డు ఇచ్చిందో అలానే తన నోట్లో పెట్టేసుకున్నాడు. ఇక ఆ గుడ్డు కాస్త గొంతులో ఇరుక్కుపోయింది. ఎవరు గమనించలేదు..తరువాత ఎంత లేపిన ఆ బిడ్డ లేవలేదు. వెంటనే కుటుంబ సభ్యుల సహాయంతో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కానీ ఏం లాభం అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు..బంగారం లాంటి బిడ్డను తల్లిదండ్రులు చేజేతులా చంపబడని ఇక తనతో పాటు అక్కడున్న వారంతా అలా నిలబడిపోయారు. ఆ కన్నతల్లి కావాలని ఈ బిడ్డను ఇలా చేయలేదు. అనుకోకుండా జరిగిన ఒక చిన్న సంఘటన ఆ బిడ్డను ఆ తల్లికి దూరం చేసింది. చూసారా ఫ్రెండ్స్ బిడ్డ ఆరోగ్యం గా ఉంటాడు అని ఆ తల్లి గుడ్డు చేతికి ఇచ్చింది. కానీ జరగరాని ఘోరం జరిగిపోయింది. ఈ విషయం ఇప్పుడెందుకు చెబుతున్నాను.

అంటే బలమైన ఆహారం పిల్లలకి ఇస్తున్నాము అనుకుంటామే కానీ వారి గురించిన ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే ఇదిగో ఇలా మన ప్రమేయం లేకుండానే తప్పిదాలు జరిగిపోతూ ఉంటాయి. సరే చిన్నపిల్లలకు గుడ్డిచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాళ్ళకి దగ్గరుండి గుడ్డును తినిపించాలి. తప్ప వాళ్ళ చేతికి ఇస్తే ఇదిగో ఇలాంటి తప్పిదాలే మళ్లీ మళ్లీ జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి చిన్న పిల్లలకు గుడ్లు తినిపించే తల్లులు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఈ నిజ సంఘటన మీకు తెలియజేస్తున్నాం.. అయితే చిన్న పిల్లలకు ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినిపించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి కూడా ఇప్పుడు చూద్దాం ఎదిగే పిల్లలకు గుడ్డు చాలా అవసరం ఇందులో వారి పెరుగుదలకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందుకే రోజు ఉదయాన్నే అల్పాహారం లో భాగంగా వారికి ఉడికించిన గుడ్లను తినిపించండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది