Finger Millet : ఇదేమి గోల రా బాబు..! ఈ మిలేట్స్ అతిగా తింటే.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవట..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Finger Millet : ఇదేమి గోల రా బాబు..! ఈ మిలేట్స్ అతిగా తింటే.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవట..!

Finger Millet : ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ చూపుతున్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని రకాల మిల్లెట్స్ ను తీసుకుంటున్నారు. మిలేట్స్ లలో ముఖ్యంగా రాగులను అతిగా తింటున్నారు. రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది రాగులు అనేది పోషక ఆహారం దీనిలో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ రాగులు ఎముకలను బలోపితం చేయడానికి ఉపయోగపడుతుంది. బోలు ఎముకలు వ్యాధి లేద ఎముకల బలహీన పడటం లాంటి పరిస్థితులను తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్ […]

 Authored By tech | The Telugu News | Updated on :12 March 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Finger Millet : ఇదేమి గోల రా బాబు..! ఈ మిలేట్స్ అతిగా తింటే.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవట..!

Finger Millet : ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ చూపుతున్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని రకాల మిల్లెట్స్ ను తీసుకుంటున్నారు. మిలేట్స్ లలో ముఖ్యంగా రాగులను అతిగా తింటున్నారు. రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది రాగులు అనేది పోషక ఆహారం దీనిలో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ రాగులు ఎముకలను బలోపితం చేయడానికి ఉపయోగపడుతుంది. బోలు ఎముకలు వ్యాధి లేద ఎముకల బలహీన పడటం లాంటి పరిస్థితులను తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్ ప్రోటీన్స్ అధికంగా ఉంటుంది. తరచూ తినాలని మీ ఆహార కోరికలను ఇది అరికడుతుంది. ఆరోగ్యకరమైన బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. అయితే అదే పనిగా వాటిని మాత్రం తింటే కూడా అనారోగ్య సమస్యలు తప్పవట. రాగులు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రాగులలో ఫైబర్, ఐరన్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మాత్రం తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే రాగులు అధికంగా తినడం వల్ల ఆ సమస్య తీవ్రత పెరుగుతుందని చెప్తున్నారు. కిడ్నీలో రాళ్లు లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే మీరు రాగుల్ని అసలు తినవద్దు…
రాగులు కొందర్లో మలబద్దక సమస్యను కలిగిస్తుంది. పిల్లనుండి పెద్దవాళ్ల వరకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కావున మీరు ఇప్పటికే మలబద్దక సమస్యతో ఇబ్బంది పడుతున్నార.. అయితే రాగులను తినడం మానేయాలి. సహజంగా శీతాకాలంలో రాగులు తినకుండా ఉండడమే ఆరోగ్యానికి మంచిది. ప్రధానంగా చల్లని వస్తువును తాకకూడదు. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

వర్షాకాలంలో కూడా రాగులు వాడటానికి దూరంగా ఉంటే మంచిది.అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు రాగులు అసలు తినవద్దు. ప్రధానంగా ఆకలి లేకపోవడం అజీర్తి లాంటి సమస్యలు ఉన్నవారు రాగులని తినకపోవడమే మంచిది. అలాగే రాగుల్లో ఉండే కొన్ని పోషకాలు అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి. మీకు కడుపులో గ్యాస్ ఏర్పడే సమస్య ఉంటే రాగులని తినక పోవడమే మంచిది. థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా రాగులని తినకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రాగుల్లో థైరాయిడ్ గ్రంధి సాధారణ పనితీరుకు ఆటంకం కలిగించే గోయిట్రో జనంతో నిండి ఉంటుంది. అందుకే థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు రాగులు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది