Finger millet : ప్రతి రోజు ఒక గ్లాస్ దీన్ని తీసుకుంటే చాలు… నిత్యం యవ్వనంగా కనిపిస్తారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Finger millet : ప్రతి రోజు ఒక గ్లాస్ దీన్ని తీసుకుంటే చాలు… నిత్యం యవ్వనంగా కనిపిస్తారు…

 Authored By ramu | The Telugu News | Updated on :22 June 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Finger millet : ప్రతి రోజు ఒక గ్లాస్ దీన్ని తీసుకుంటే చాలు... నిత్యం యవ్వనంగా కనిపిస్తారు...

Finger millet : మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే ధాన్య లలో రాగులు కూడా ఒకటి. మిల్లెట్లను ఇతర మార్గాలలో మరియు పలు ఆహార పదార్థాలలో కూడా వాడతారు.అయితే ఈ రాగి పిండిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అయితే వీటిని రాగి ముద్ద, రాగి రోటి, రాగి గంజి, రాగి అంబలి ఇలా ఎన్నో రకాలుగా తయారు చేసుకుని మరీ తీసుకుంటూ ఉంటారు. ఈ మిల్లెట్ లో కాల్షియం అనేది అధిక మోతాదులో ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి ఎంతో బాగా పని చేస్తుంది. పిల్లలకు సరైన పెరుగుదలకు కూడా ఈ రాగులు ఎంతగానో పని చేస్తాయి. మహిళలు మరియు వృద్ధుల ఎముకల ను బలోపేతం చేసేందుకు ఈ మిల్లెట్ మాల్ట్ ను ప్రతినిత్యం తీసుకుంటే చాలా మంచిది. అయితే రాగి గజ్జి తీసుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మిల్లెట్ మాల్ట్ ఎముకలను బలోపేతం చేయడానికి మరియు మినరల్స్ ఏర్పడడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రాగి మాల్ట్ ను తీసుకుంటే మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. అయితే రాగులలో ఉండే పోషకాలు ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు, ఎ,బి, సి, మినరల్స్ మన శరీరానికి ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. దీనిని తీసుకోవటం వలన జీర్ణశక్తి ఎంతగానో మెరుగుపడుతుంది. రాగుల్లో ఉన్న అమైనో ఆమ్లాలు ట్రిప్టోపాన్ అనేది ఆకలిని నియంత్రిస్తుంది. దీనిని తీసుకోవడం వలన బరువు కూడా అదుపులో ఉంటుంది. మిల్లెట్ పిండితో చేసినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వలన జీర్ణక్రియ అనేది మందగిస్తుంది. అలాగే రాగులు గుండె బలహీనత మరియు ఉబ్బసాన్ని కూడా నియంత్రిస్తుంది…

Finger millet ప్రతి రోజు ఒక గ్లాస్ దీన్ని తీసుకుంటే చాలు నిత్యం యవ్వనంగా కనిపిస్తారు

Finger millet : ప్రతి రోజు ఒక గ్లాస్ దీన్ని తీసుకుంటే చాలు… నిత్యం యవ్వనంగా కనిపిస్తారు…

రాగులతో చేసినటువంటి ఆహారాన్ని తీసుకోవటం వలన వృద్ధాప్యంలో శరీరానికి బలం అనేది వస్తుంది. మిల్లెట్ ఫుడ్ ను ప్రతినిత్యం తీసుకోవడం వలన శరీరానికి కూడా ఎంతో శక్తి ని ఇస్తుంది.ఈ రాగులను తీసుకోవడం వలన చర్మం అనేది మెరుస్తూ, మృదువుగా కూడా తయారవుతుంది. దీని వలన మీరు ఎప్పుడు కూడా యవ్వనంగా కనిపిస్తారు. ఈ రాగులలో ఐరన్ అనేది పుష్కలంగా ఉండడం వలన రక్తహీనత సమస్య నుండి కూడా ఉపసమనం కలిగిస్తుంది. గంజి మరియు పాలతో కలిపినటువంటి మిల్లెట్ మధుమేహానికి దివ్య ఔషధం లాగా పని చేస్తుంది. వీటిని ప్రతినిత్యం గనక తీసుకున్నట్లయితే రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. మిల్లెట్ ఫైటో కెమికల్స్ జీర్ణ ప్రక్రియను కూడా నెమ్మది చేస్తుంది. వీటిని తీసుకోవటం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర స్థాయిలను తగ్గించటంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాక అధిక రక్తపోటు మరియు ఇతర కరోనరీ సమస్యలతో బాధపడే వారికి ఫైబర్ అనేది ఎక్కువ మోతాదులో అందుతుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది