Obesity : ఊబకాయం సమస్య వేధిస్తోందా? ఈ ఒక్క పని చేయండి చాలు.. మీరే ఆశ్చర్యపోతారు?
Obesity : ఒబెసిటీ తెలుసు కదా. దాన్నే ఊబకాయం అంటాం. లేదా స్థూలకాయం అంటాం. అచ్చ తెలుగులో చెప్పాలంటే బరువు పెరగడం అని అంటాం. ఈ జనరేషనే వేరు. ఈ జనరేషన్ లో ఊబకాయం అనేది ఓ ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చొని పనిచేయడం వల్ల.. ఊబకాయం సమస్య వేధిస్తోంది. అలాగే.. చాలా గంటలు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల.. ఊబకాయం సమస్య వస్తోంది. పొట్ట చుట్టూ అనవసర కొవ్వు పేరుకుపోవడం వల్ల.. అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో ఒబెసిటీ సమస్య వస్తోంది.
ఊబకాయం సమస్య వచ్చిందంటే.. ఇక ఇతర రోగాలు కూడా క్యూ కట్టినట్టే. గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు కూడా ఊబకాయం వల్ల వస్తుంటాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించాలి. దాని కోసం కసరత్తులు చేయాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఎన్నింటినో త్యాగం చేయాలి. అయితే.. కొందరు ఎంత చేసినా కూడా అస్సలు బరువు తగ్గరు. ఎంత కష్టపడి కసరత్తులు చేసినా అస్సలు బరువు తగ్గరు. అటువంటి వాళ్లు ఏం చేయాలి? ఏం చేస్తే ఊబకాయం సమస్య నుంచి బయట పడతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Obesity : రాగులను ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే
మిల్లెట్స్ తెలుసు కదా. అంటే చిరు ధాన్యాలు. అవి శరీరానికి ఎంతో మంచివి. అయితే.. బరువు తగ్గాలనుకుంటే మాత్రం రాగులను ఎక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గడానికి చేసే వ్యాయామంతో పాటుగా.. రాగులను కూడా ఎక్కువగా తీసుకోవాలి. రాగులలో అస్సలు కొలెస్టరాలే ఉండదు. అలాగే.. రాగుల్లో సోడియం కూడా ఉండదు. దీంట్లో ఎక్కువగా మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. అవే శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.
రాగులను ఎక్కువగా తీసుకోవడం వల్ల.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు.. బరువు కూడా వేగంగా తగ్గుతారు. రాగుల్లో ఎక్కువగా కాల్షియం ఉండటం వల్ల.. రాగులు ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే.. దీంట్లో ఉండే.. ఐరన్, మెగ్నీషియం, ఫైబర్.. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. రాగిలో ఎక్కువగా ఉండే ఫైబర్ వల్లనే బరువు తగ్గుతారు. ఫైబర్ తినగానే వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. దాని వల్ల తొందరగా ఆకలి అనిపించదు.
Obesity : రాగులను ఎలా తినాలి?
రాగులను మొలకెత్తింపజేసి కూడా తినొచ్చు. మొలకెత్తిన రాగులు తిన్నా బాగానే ఉంటుంది. రాగి జావ కూడా చేసుకొని తాగొచ్చు. అలాగే.. రాగి పిండితో దోశలు చేసుకోవచ్చు. ఇడ్లీలు చేసుకోవచ్చు. రాగితో పలు రకాల వంటకాలను చేసుకొని తినొచ్చు. రాగులను నిత్యం తీసుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటు.. ఊబకాయం సమస్య నుంచి కూడా తప్పించుకోవచ్చు.
ఇది కూడా చదవండి ==> గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?
ఇది కూడా చదవండి ==> ఎక్కిళ్లు వేధిస్తున్నాయా? వాటిని చిటికెలో ఇలా తగ్గించే చిట్కాలు ఇవే..!
ఇది కూడా చదవండి ==> జుట్టు తీగ వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> వామును ఇలా తీసుకున్నారంటే.. ఒక్క నెలలోనే 20 కేజీలు తగ్గుతారు..!