Galijeru Aaku : ఈ మొక్క ఎక్కడ కనిపించిన అస్సలు వదలకండి… దీనిలో ఎన్ని లాభాలో… ఈ సమస్యలన్నీ పరార్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Galijeru Aaku : ఈ మొక్క ఎక్కడ కనిపించిన అస్సలు వదలకండి… దీనిలో ఎన్ని లాభాలో… ఈ సమస్యలన్నీ పరార్…!

Galijeru Aaku : పల్లెటూరులో ఖాళీ ప్రదేశాలలో ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కలు బాగా పెరుగుతుంటాయి.ఈ మొక్కలలో తెల్ల గలిజేరు మొక్క ఒకటి. ఈ మొక్కలన్నింటినీ మనం పిచ్చి మొక్కలు అని తీసిపారేస్తూ ఉంటాం. నిజం చెప్పాలంటే. ఈ మొక్క లో ఉన్న ఔషధ గుణాలు గురించి మీకు తెలిస్తే అప్పుడు ఈ మొక్క ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ మరీ వెళ్లి ఇంటికి తెచ్చుకుంటారు. ఈ తెల్ల గలిజేరు మొక్కని ఔషధ ఘనీ గా ఆయుర్వేద నిపుణులు […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 July 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Galijeru Aaku : ఈ మొక్క ఎక్కడ కనిపించిన అస్సలు వదలకండి... దీనిలో ఎన్ని లాభాలో... ఈ సమస్యలన్నీ పరార్...!

Galijeru Aaku : పల్లెటూరులో ఖాళీ ప్రదేశాలలో ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కలు బాగా పెరుగుతుంటాయి.ఈ మొక్కలలో తెల్ల గలిజేరు మొక్క ఒకటి. ఈ మొక్కలన్నింటినీ మనం పిచ్చి మొక్కలు అని తీసిపారేస్తూ ఉంటాం. నిజం చెప్పాలంటే. ఈ మొక్క లో ఉన్న ఔషధ గుణాలు గురించి మీకు తెలిస్తే అప్పుడు ఈ మొక్క ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ మరీ వెళ్లి ఇంటికి తెచ్చుకుంటారు. ఈ తెల్ల గలిజేరు మొక్కని ఔషధ ఘనీ గా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయుర్వేదంలో ఈ మొక్కను పునర్నవ అని అంటారు. అయితే మన భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో ఈ మొక్కలను ఎన్నో రకాలుగా వాడతారు. ఇది ఎన్నో రకాల వ్యాధులకు కూడా దివ్య ఔషధం లాగా పని చేస్తుంది. అవి ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గలిజేరు మొక్కలు రెండు రకాలు ఉన్నాయి. తెల్ల పూలు పూసే దానిని తెల్ల గలిజేరు మొక్క అని అంటారు. అలాగే ఎర్ర పూలు పూసే దానిని ఎర్ర గలి జేరు మొక్క అని పిలుస్తారు. ఈ మొక్క అనేది నేల మీద పాకుతుంది. దీని ఆకులు గుండ్రంగా అర్ధ రూపాయి అంత మాత్రమే ఉంటాయి. ఈ రెండిటి మొక్కలకు ఔషధ గుణాలు ఒకలాగే ఉన్న, తెల్ల గలిజేరు మొక్క ఎంతో మంచిది అని అంటుంటారు.

దీని గురించి ఒక మాటలో చెప్పాలంటే. ప్రతి కణానికి కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి పునరుజ్జి వితం చేయగల శక్తి ఉంది. కావున దీనిని పునర్నవ అని పిలుస్తారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ సి,డి, మూత్రళాల ఇన్ఫెక్షన్ ను నియంత్రించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. దీనిలో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది.అలాగే కిడ్నీ సమస్యలకు దివ్య ఔషధం గా కూడా పని చేస్తుంది. ఈ తెల్ల గలిజేరు ఆకులను ఒక పిడికెడు తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పావు లీటర్ మంచి నీళ్ల లో వేసి మరిగించుకోవాలి. తర్వాత వాటిని చల్లార్చుకొని వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం లేవగానే పరిగడుపున ఒక గ్లాసు తీసుకుంటే కిడ్నీలు క్లీన్ అవ్వటంతో పాటు మూత్రనాళ సమస్యల నుండి కూడా ఉపసమనం కలుగుతుంది. ఇలా గనక మీరు ప్రతినిత్యం ఒక గ్లాస్ ఈ రసాన్ని 21 రోజులు తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అంతేకాక దీనిని తీసుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఏమి తినకూడదు అంటున్నారు.

Galijeru Aaku ఈ మొక్క ఎక్కడ కనిపించిన అస్సలు వదలకండి దీనిలో ఎన్ని లాభాలో ఈ సమస్యలన్నీ పరార్

Galijeru Aaku : ఈ మొక్క ఎక్కడ కనిపించిన అస్సలు వదలకండి… దీనిలో ఎన్ని లాభాలో… ఈ సమస్యలన్నీ పరార్…!

ఈ తెల్ల గలిజేరు ఆకు, కాండం వేరు తో సహా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఈ ఆకులను ప్రతినిత్యం తీసుకోవడం వలన రేచీకటి, మూత్రనాల దోషాలు, కఫం లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే అధిక బరువు, లివర్ వాపు, కామెర్లు, మధుమేహం,వరిబీజం, వాతం, శ్వాసకు సంబంధించిన సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే రక్త శుద్ధి కీళ్ళ నొప్పులు, బహిష్టి సమస్యలు అన్ని రకాల జ్వరాలను నియంత్రించడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ తెల్ల గలిజేరు మొక్క ఆకులను తీసుకొని వాటిని మెత్తగా నూరి ము ఖానికి అప్లై చేసుకున్నట్లయితే ముఖం మీద మచ్చలు తగ్గుతాయి. ఈ గలిజేరు ఆకులను మెత్తగా నూరిన తర్వాత దాని నుండి రసాన్ని తీసి దానికి సమానంగా నువ్వుల నూనెను కలుపుకొని నూనె మిగిలే వరకు సన్నని సెగపై కాల్చి వాతం, నొప్పులున్న చోట మరియు కీళ్ళ నొప్పులకు మసాజ్ చేయటం వలన తొందరగా నొప్పులు అనేవి తగ్గుతాయి. ఈ మొక్క శరీరాన్ని డిటాక్స్ ఫై చేసేందుకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ పునర్నవ మొక్క యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలను నయం చేయటంలో ఔషధంలా పని చేస్తుంది. వీటిని తీసుకోవటం వలన మూత్రనాలాన్ని క్లీన్ చేయటంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే మూత్ర సంబంధించి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది