Guava : చలికాలంలో జామపండు బ్లాక్ సాల్ట్ కలిపి తింటే ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలో తెలిస్తే.. వావ్ అంటారు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Guava : చలికాలంలో జామపండు బ్లాక్ సాల్ట్ కలిపి తింటే ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలో తెలిస్తే.. వావ్ అంటారు..!

Guava : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఎన్ని ఆస్తిపాస్తులున్నా నిరుపయోగమే.. ఇప్పుడు చాలామందికి డబ్బు సరిపడా ఉన్న అన్ని కొలుచుకొని తినాల్సి వస్తుంది. దీనికి కారణం కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్య స్పృహ అవగాహన లేకుండా జీవించడమే అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఒంటిని చుట్టూ ముట్టిన తర్వాత కానీ ఆరోగ్యకరమైన ఆహారం గురించి వెతుకులాట మొదలు పెట్టరు. మంచి ఆరోగ్యం ఉండాలంటే పండ్లు తినాలని చిన్నపిల్లలతో సహా తెలుసు.. అయితే […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 January 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Guava : చలికాలంలో జామపండు బ్లాక్ సాల్ట్ కలిపి తింటే ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలో తెలిస్తే.. వావ్ అంటారు..!

Guava : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఎన్ని ఆస్తిపాస్తులున్నా నిరుపయోగమే.. ఇప్పుడు చాలామందికి డబ్బు సరిపడా ఉన్న అన్ని కొలుచుకొని తినాల్సి వస్తుంది. దీనికి కారణం కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్య స్పృహ అవగాహన లేకుండా జీవించడమే అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఒంటిని చుట్టూ ముట్టిన తర్వాత కానీ ఆరోగ్యకరమైన ఆహారం గురించి వెతుకులాట మొదలు పెట్టరు. మంచి ఆరోగ్యం ఉండాలంటే పండ్లు తినాలని చిన్నపిల్లలతో సహా తెలుసు.. అయితే ఏ పండు తింటే మనం ఆరోగ్యాన్ని బలపరుచుకోవచ్చో మనకు కచ్చితంగా తెలియదు..మనకు నచ్చిన పండును లేక ఫలానా పండు ఆరోగ్యానికి మంచిదని ఎవరో చెబితేనో ఎక్కడో చదివితేనో ఆ పండ్లను ఎక్కువగా తింటున్నాం..

కానీ మన పరిసరాల్లో కాసే పండ్లలో లభించే పోషకాల పట్ల మాత్రం కాస్త తక్కువ అవగాహనతోనే ఉంటాం. అందులో ఒకటైన జామపండు మనం ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. అంతేకాదు కాలయానికి మంచి టానిక్ లాంటిది.. జామకాయ జ్యూస్ తీసుకోవడం ద్వారా రక్తంలోని కొలెస్ట్రాల్లో తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు రోజు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా షుగర్ని తగ్గించుకోవచ్చు. చాలా ఎఫెక్ట్ గా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి కార్యము కూడా బ్లడ్ షుగర్ లెవల్స్ ను జామకాయ బాగా పనిచేస్తుంది. జామపండు తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ దీని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే కోనీ మరి కాయను తెచ్చుకుని తింటారు. ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామ ఎక్కువ పీచు పదార్థం ఫైబర్ కలిగి ఉంటుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.వయసుకు ముందే ముఖంపై ముడతలు చర్మంపై లేకుండా చేస్తుంది. ఏ, బి, సి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి.

కంటి సమస్యలు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది. స్త్రీలలో రుతు చక్ర సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. జామ పండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. దీనిలో విటమిన్స్ ఉండడం వల్ల ఊపిరితిత్తులకు చర్మానికి, కంటికి చాలా మంచిది. కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయలు ఉండే లైకోపీన్ అడ్డుకుంటుంది. జామకాయలో ఉండే పొటాషియం గుండె జబ్బులు బీపీ పెరగకుండా చేస్తాయి. అంతేకాకుండా జామకాయలు బి కాంప్లెక్స్ విటమిన్స్ వి6 ఉంటాయి. ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగా మాగి న జామ పండు లోని 50 గ్రాముల గూర్జు పది గ్రాములు తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది