Hair Tips : కలబంద లో వీటిని కలిపి రాస్తే.. ఈ మూడు సమస్యలకు చెక్ పెట్టవచ్చు..
Hair Tips : కలబంద మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. కేవలం చర్మవ్యాధులను నయం చేయడమే కాకుండా అనేక జుట్టు సమస్యలను నివారిస్తుంది. అది కూడా ఎక్కువ ఖర్చు లేకుండానే. కలబందలో 75 పోషక విలువలు ఉంటాయి. ఈ మొక్కలో 100 కి పైగా సూక్ష్మ పోషకాలు ఉంటాయి. కలబందలోని ప్రోటియో లైటిక్ ఎంజైమ్స్ తల మాడు పై ఉండే పాడైన కణాలను బాగు చేస్తాయి. కుదుర్ల ఆరోగ్యాన్ని బాగు చేసి త్వరగా జుట్టు పెరిగేలా చేస్తుంది. కలబందను జుట్టుకు రాయడం వలన సున్నితంగా, మెత్తగా తయారవుతుంది. అలాగే కలబందలోని ఫంగల్ చుండ్రు సమస్యలను నివారిస్తుంది. అయితే కలబందలో వీటిని కనుక కలిపి రాస్తే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య, తెల్ల వెంట్రుకల సమస్య తగ్గిపోతుంది. ఈ చిట్కాను వారానికి ఒకసారి చేస్తే జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. అయితే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
మన ఇంటిలో దొరికే కొన్ని వస్తువులతో సులువుగా జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు, చుండ్రు సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల బియ్యంలో అర గ్లాసు నీటిని పోసి 5 గంటలు నానబెట్టి బియ్యం నీటిని వడకట్టి ప్రక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నీళ్లు కాస్త వేడి అయ్యాక అందులో రెండు టీ స్పూన్ల టీ పొడి వేసి బాగా మరిగించి డికాషన్ వడగట్టుకోని ప్రక్కన పెట్టుకోవాలి. తర్వాత కలబంద ఆకులు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి నాలుగు మందార పువ్వులు, కలబంద ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి.
ఈ పేస్టును ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో మనం ముందుగా తయారుచేసి పక్కన పెట్టుకున్న టీ డికాషన్ 4 స్పూన్ల వరకు వేయాలి. తర్వాత నాలుగు స్పూన్ల బియ్యం నీరు, అర స్పూన్ ఆముదం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకుదురుల నుండి చివర్ల దాకా బాగా పట్టించి ఒక గంట దాకా ఆరనివ్వాలి. తర్వాత షాంపూ తో కాకుండా కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే జుట్టురాలే సమస్య, చుండ్రు సమస్య, తెల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది. ఈ మూడు సమస్యలను తగ్గించడానికి ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. ఈ విధంగా చేయడం వలన తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. చిట్కాను వారానికి ఒకసారి తయారు చేసుకొని అప్లై చేసుకుంటే మంచిది.