Hair Tips : ఈ చిట్కాతో తక్కువ టైం లో ఎక్కువ హెయిర్ గ్రోత్..!!
Hair Tips : బాదంపప్పు ఎన్నో పోషకాలు కలిగిన ఆహారం. వీటిని ప్రతిరోజు తినడం వలన మన శరీరానికి అనేక పోషక విలువలు లభిస్తాయి. 100 గ్రాముల బాదంపప్పు తీసుకుంటే ఇందులో 609 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ 6 గ్రాములు, ప్రోటీన్ 18 గ్రాములు, ఫైబర్ 13 గ్రాములు ఉంటుంది. అలాగే బాదం పప్పులో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో కొవ్వులు ఉంటాయి. ఇందులో పాలి అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్ 13 గ్రాములు, మోనో అన్ సాచ్యురేటెడ్ 18 గ్రాములు సాచ్యురేటెడ్ ఫ్యాట్ నాలుగు గ్రాములు ఉంటాయి. దీని వలన బాదం పప్పు గుండెకు చాలా మంచిదని చెప్పవచ్చు.
అలాగే బాదం పప్పులో విటమిన్ ఇ 26 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. విటమిన్ కే కూడా సమృద్ధిగా ఉంటుంది. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే బాదంపప్పు గుండెకు చాలా మంచిది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. లివర్ పనితీరుకు బాగా సహాయపడుతుంది. డయాబెటిస్ బాధితులకు మంచి ఆహారం. ఇందులో కార్బోహైడ్రేట్స్ మూడు గ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఎవరు తీసుకున్న షుగర్ పెరగదు. సిగరెట్ తాగేవారు రోజు 30 గ్రాములు తీసుకుంటే ఊపిరితిత్తులు డామేజ్ కాకుండా ఉంటాయి. ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచడానికి బాదంపప్పులో మెగ్నీషియం బాగా ఉపయోగపడుతుంది .
ఇందులో ముఖ్యంగా 20 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో కేటాయిజిన్ ఏఫీ కేటాజిన్, కెటాజిన్, విటమిన్ ఇ ఇవన్నీ యాంటి ఆక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి జబ్బులు బారిన పడకుండా కాపాడుతాయి. దీంతోపాటు ఈ బాదంపప్పు జుట్టుకు చాలా మేలు చేస్తుంది. జుట్టుకు విటమిన్ ఇ ని అందిస్తుంది. జుట్టు బాగా పెరగటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా విటమిన్ ఇ చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. బాదం పప్పు తినే పద్ధతి కూడా వేరేగా ఉంటుంది. వీటిని కచ్చితంగా నానబెట్టుకుని తినాలి. అలాగే తొక్కతో సహా తీసుకుంటే చాలా మంచిది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు ప్రతిరోజు నానబెట్టుకున్న బాదంపప్పులను తినాలి. ఇలా తింటే మంచి ఫలితాన్ని పొందుతారు.