Hair Tips : ఈ చిట్కాతో జుట్టు పెరగటం గ్యారెంటీ
Hair Tips : ఇప్పుడు చాలామందిని వేధించే సమస్య జుట్టు రాలడం. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా చాలామందికి ఈ రోజుల్లో జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. దీనికి కారణం మన దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, పనిలో ఒత్తిడి, ఆందోళన ఇలా పలు కారణాల వలన జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది. దీనికోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తారు. అయినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా వీటిని ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక జుట్టు పెరగదు అనుకున్న వారు ఈ చిట్కాను కనుక ట్రై చేశారంటే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేయడానికి ముందుగా ఒక గుప్పెడు మెంతులను రాత్రి పడుకునే ముందు నానబెట్టుకోవాలి. తర్వాత ఉదయాన్నే ఆ మెంతులను నీటితో సహా మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. మెంతులు అనేవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. మెంతుల్లో ఉండే పోషకాలు జుట్టుకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మెంతులు తలలో వేడిని కూడా తగ్గిస్తాయి. మెంతులు వేసుకున్న తర్వాత జుట్టుకు సరిపడా కరివేపాకు రెబ్బలను వేసుకోవాలి. కరివేపాకులో బీటా కిరోటిన్ ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. కరేపాకును జుట్టుకు మాత్రమే కాదు ఆహారంలో కూడా తరచూ తీసుకోవడం చాలా మంచిది. తరువాత మెంతులను కరివేపాకును మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో రెండు లేదా మూడు స్పూన్ల పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత పొడి జుట్టుకు మాత్రమే ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. నూనె తలకు అప్లై చేసుకోకూడదు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకుదుర్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. ఒక అరగంటసేపు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా షాంపూతో లేదా కుంకుడుకాయ తో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వలన జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే ఈ చిట్కా వలన చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. నెలలోపే మీ జుట్టు రాలడం జుట్టు సమస్య తగ్గిపోతుంది. ఈ చిట్కా వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక అన్ని వయసుల వారు వాడవచ్చు.