Hair Tips : నెలకు ఒక్కసారి ఇది రాశారంటే… జుట్టు రాలడం తగ్గిపోతుంది…
Hair Tips : ప్రస్తుతం ప్రతి ఒక్కరికి జుట్టు రాలే సమస్య ఎక్కువైపోతుంది. దానికి కారణం వాతావరణ మార్పులు, తినే ఆహారంలో పోషకాల లోపం ఇలా ఎన్నో కారణాల వలన జుట్టు రాలే సమస్య ఎక్కువైపోతుంది. జుట్టు రాలడాని తగ్గించడం కోసం రకరకాల ఆయిల్స్, క్రీమ్స్ ను ఉపయోగిస్తారు. వీటిలో అనేక రకాల కెమికల్స్ ఉంటాయి. వీటి వలన జుట్టు రాలే సమస్య ఇంకా ఎక్కువ అవుతాయి. అలాగే జుట్టు రాలడం తగ్గించడానికి రకరకాల షాంపులను వాడుతుంటారు. కెమికల్స్ జుట్టు కుదుళ్లను బలహీనంగా చేస్తాయి. దీంతో జుట్టు రాలే సమస్య ఎక్కువైపోతుంది. జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు చివర్లు చిట్టడం వంటి సమస్యలు తగ్గాలంటే ఒకసారి ఈ చిట్కాను ట్రై చేసినట్లయితే అన్ని సమస్యలు తగ్గించుకోవచ్చు. కేవలం పది రూపాయలతోనే చిట్కాను ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు.
ఈ ఫ్యాక్ అప్లై చేయడం వలన జుట్టు డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. జుట్టు కుదుళ్లలో పేరుకుపోయిన కెమికల్స్ అన్ని పోతాయి. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్ల ముల్తాన్ మట్టి వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి. అలోవెరా జెల్ వద్దనుకున్నవారు కీరదోసకాయ జ్యూస్ వేసుకోవాలి. అరబద్ద నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. నిమ్మరసం వద్దనుకున్నవారు ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకోవాలి. తర్వాత తలకి రాసుకునే విధంగా ఉండేలా రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ముందు తలస్నానం చేసి జుట్టు ఆరనివ్వాలి.
తర్వాత ఈ ప్యాక్ అప్లై చేసుకునే ముందు నీళ్లతో ఒకసారి జుట్టును తడిపి ప్యాక్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల దాకా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత చేతివేళ్లతో ఒక పావుగంట స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి. తర్వాత నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. షాంపూ చేయాల్సిన అవసరం లేదు. ఇలా నెలకు ఒకసారి చేస్తే జుట్టు కుదుళ్లకు పట్టిన కెమికల్స్ అన్నీ పోతాయి. జుట్టు రాలడం, చుండ్రు, దురద ఇన్ఫెక్షన్స్, జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు చాలా స్మూత్ గా సిల్కీగా పొడవుగా పెరుగుతుంది. ఈ చిట్కాను అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు.