Hair Tips : ఇది రాసారంటే… ఎంత తెల్ల జుట్టు అయినా సరే నల్లగా మారుతుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : ఇది రాసారంటే… ఎంత తెల్ల జుట్టు అయినా సరే నల్లగా మారుతుంది…

Hair Tips : ఇప్పుడు చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య తెల్ల జుట్టు. ఈ తెల్ల జుట్టు అనేది వయస్సుతో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి దాకా అందర్నీ బాధపడుతుంది. జీవన విధానంలో మార్పుల వలన, తినే ఆహారంలో పోషకాలు లోపించడం వలన ఇలా కొన్ని కారణాల వలన తెల్ల జుట్టు వస్తోంది. అలాగే మన తలలో మెలానీన్ లోపం వలన కూడా జుట్టు తెల్లగా ఉంటుంది. కొందరు జుట్టు తెల్లగా ఉంటే నలుగురిలోకి వెళ్లి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 July 2022,3:00 pm

Hair Tips : ఇప్పుడు చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య తెల్ల జుట్టు. ఈ తెల్ల జుట్టు అనేది వయస్సుతో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి దాకా అందర్నీ బాధపడుతుంది. జీవన విధానంలో మార్పుల వలన, తినే ఆహారంలో పోషకాలు లోపించడం వలన ఇలా కొన్ని కారణాల వలన తెల్ల జుట్టు వస్తోంది. అలాగే మన తలలో మెలానీన్ లోపం వలన కూడా జుట్టు తెల్లగా ఉంటుంది. కొందరు జుట్టు తెల్లగా ఉంటే నలుగురిలోకి వెళ్లి మాట్లాడడానికి ఫీలవుతుంటారు. చాలామంది జుట్టు నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల హెయిర్ కలర్స్ ను ఉపయోగిస్తారు. దీనిలో ఉండే అమోనియం వంటి కెమికల్స్ మన జుట్టు రాలిపోవడం వంటి కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది.

తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి మన ఇంట్లోనే కొన్ని వస్తువులతో ప్రయత్నించవచ్చు. ఈ హోమ్ రెమిడి వలన జుట్టుకు మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉపయోగించేటివి అన్ని ఇంట్లో దొరికేటివి. కనుక సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక దీనిని అందరూ వాడవచ్చు.దీనిని తయారు చేయడానికి మనకు ముందుగా కావాల్సింది ఉల్లిపాయ తొక్కలు. ఉల్లిపాయ మన జుట్టు బలంగా ఉంచడంతోపాటు తెల్ల జుట్టును నివారిస్తుంది. అలాగే చుండ్రు సమస్యలు కూడా తగ్గిపోతాయి. అయితే ఇప్పుడు ఒక ఇనుప కడాయిని తీసుకొని స్టవ్ పై పెట్టుకొని అందులో జుట్టుకు సరిపడా ఉల్లితొక్కలను వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్ లో ఉంచి ఉల్లి తొక్కలను రంగు మారేంతవరకు కలుపుతూ వేయించుకోవాలి.

Hair Tips for white hair problems

Hair Tips for white hair problems

ఇలా పది నిమిషాల పాటు వేయిస్తే ఉల్లి తొక్కలు నలుపు రంగులోకి వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఉల్లి తొక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఉల్లి తొక్కలను చేతులతో గాని, మిక్సీ జార్ లో గాని వేసుకొని మెత్తగా పొడి లాగా చేసుకోవాలి. ఆ తర్వాత జల్లెడ సహాయంతో ఆ పొడిని జల్లించుకోవాలి. ఇలా జల్లించగా వచ్చిన పొడిలో ఒక స్పూన్ వెజీలీన్ వేసి కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మన జుట్టు మొత్తానికి రాసుకోవాలి. ఇలా ఒకరోజు రాత్రి మొత్తం ఉంచుకోవాలి. తర్వాత మీ రోజు వారి షాంపూ తో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది