Hair Tips : కరివేపాకులో ఇవి కలిపి రాశారంటే… జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : కరివేపాకులో ఇవి కలిపి రాశారంటే… జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది…

 Authored By aruna | The Telugu News | Updated on :31 August 2022,3:20 pm

Hair Tips : మన భారతీయ వంటకాల్లో కరివేపాకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎక్కువగా దీనిని రుచికోసమే వంటలలో వాడుతారు. తినేటప్పుడు పక్కకు తీసి పడేస్తుంటారు. కరివేపాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. కరేపాకును కేవలం వంటలలోనే కాదు వివిధ ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు. కరివేపాకులో యాంటీ కాసినోజినిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హేపటో ప్రొడక్టివ్ ఎక్కువగా ఉంటాయి. ఇది మన కాలేయానికి రక్షణ కల్పిస్తాయి. అలాగే కరివేపాకుతో జుట్టు సమస్యలను కూడా నివారించవచ్చు. ప్రతిరోజు కరివేపాకు తినడం వలన జుట్టు సమస్యలు తగ్గిపోతాయి.

కరివేపాకు జుట్టుకు మేలు చేస్తుంది కాబట్టి తినే ఆహారం కరివేపాకుని తినాలి. జుట్టుకు కరివేపాకును పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకోవడం వల్ల నలుపు రంగులోకి వస్తుందని అంటుంటారు. అలాగే కరివేపాకు బరువు తగ్గించడంలోనూ, చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో కరివేపాకు ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు తెల్లగా ఉన్నవారు కరివేపాకును వాడడం వలన జుట్టు నల్లబడుతుంది. అలాగే జుట్టు పొడిబారిన, చిట్లిన వెంట్రుకలకు కరివేపాకు పేస్టు రాస్తే జుట్టు ఆరోగ్యంగా సున్నితంగా తయారవుతుంది. జుట్టు నల్లగా మారటానికి కరివేపాకు నూనె లేదా హెయిర్ మాస్క్ ను ఉపయోగించవచ్చు.

Hair Tips Hair pack with Curry leaves

Hair Tips Hair pack with Curry leaves

కరివేపాకు నూనెను తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని జుట్టుకు సరిపడా తాజా కరివేపాకులను వేసుకోవాలి. ఇందులో సగం కొబ్బరి నూనె సగం తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కడాయి పెట్టుకుని అందులో నూనె వేడి చేయాలి. కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కాసేపు ఉడికించాలి. నూనె మరిగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ నూనె చల్లారాక జుట్టు కుదర్ల నుంచి చివర్ల దాకా పట్టించాలి. త్వరలోనే జుట్టు బలహీనత పోయి ఒత్తుగా తయారవుతుంది. అలాగే కరివేపాకు హేయిర్ మాస్క్ చేయడానికి కరివేపాకు పేస్టును నూరాలి. ఇందులో ఒక గిన్నె పెరుగు, రెండు చెంచాల తేనె కలపాలి. ఈ మాస్క్ ను జుట్టుకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత జుట్టును బాగా కడగాలి. ఇలా చేయడం వలన జుట్టు ఊడడం తగ్గి ఒత్తుగా తయారవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది