Hair Tips : తోక లాగా ఉన్న జుట్టు కూడా ఇది తగిలితే చాలు… పొడవుగా, ఒత్తుగా మారిపోతుంది…!
Hair Tips : ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి ఒక్కరి లో జుట్టు సమస్యలు చూస్తూనే ఉన్నాం.. ఈ సమస్యలు రోజురోజుకి ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ సమస్య మగవారిలో, ఆడవారిలో కూడా బాగా కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గించుకోవడానికి లోపల నుంచి ఎక్కువ జాగ్రత్తలు వహిస్తే ఈ సమస్య తగ్గిపోతుంది. జుట్టు రాలే సమస్యను ప్రారంభం అవ్వగానే ఎక్కువగా కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. అయితే అటువంటి వారికి తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ లు కూడా ఉంటాయి. కావున చిన్న పాటి టిప్స్ ని ట్రై చేస్తే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు.
ఇప్పుడు మనం ఒక టిప్ గురించి చూద్దాం.. ఈ టిప్ వాడినట్లయితే తోకలా ఉన్న జుట్టు కూడా పొడవుగా, దొడ్డిగా అవుతుంది. ఈ చిట్కా తయారు చేసుకోవడానికి మొదటగా ఒక గిన్నె తీసుకొని రెండు చెంచాల మెంతులని వేసుకోవాలి. ఈ మెంతులు జుట్టు రాలడం ఆపి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. మెంతులు జుట్టుని మార్చురైజ్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే జుట్టుని మృదువుగా మెరిసేలా చేస్తుంది. తర్వాత దీనిలో లవంగాలు కూడా వేసుకోవాలి. ఈ లవంగాలు జుట్టు రాలడం ఆపడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి.అలాగే దీనిలో 100 ఎంఎల్ వాటర్ ని కూడా వేసి నైట్ మొత్తం నానబెట్టుకొని మరునాడు డైరెక్ట్ గా కూడా ఉపయోగించుకోవచ్చు.
ఒకవేళ సమయం లేకపోతే వీటిని స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు పాటు కాగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపుకొని దీనికోసం మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి వీటితోపాటు లవంగాలు మెంతులతో పాటు ఆ నీటిని కూడా వేసి మిక్సీ వేసుకోవాలి. ఈ వేసుకున్న మిశ్రమాన్ని ఏదైనా కాటన్ క్లాత్లో వేసి మెత్తటి జల్ లాంటి పదార్థాన్ని స్ట్రైనర్ చేసుకోవాలి. దీనిని డ్రై హెయిర్ ఉన్నప్పుడు పెట్టుకొని 45 నిమిషాల వరకు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా గాడ్త తక్కువ గల షాంపుతో తలస్నానం చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వలన జుట్టు రాలడం ఆగి జుట్టు పొడవుగా, ఒత్తుగా ఎదుగుతుంది. ఈ విధంగా వారానికి ఒకసారి చేసుకోవడం వలన అధికంగా రాలే జుట్టు సమస్య ఉన్నవాళ్లు ఈ టిప్ ని ట్రై చేసినట్టయితే మంచి ఫలితం దక్కుతుంది.