Hair Tips : ఈ ఆహార పదార్థాలు, ఈ చిట్కాలు పాటిస్తే.. ఒత్తయిన జుట్టు మీ సొంతం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : ఈ ఆహార పదార్థాలు, ఈ చిట్కాలు పాటిస్తే.. ఒత్తయిన జుట్టు మీ సొంతం…!!

Hair Tips : ఎవరైనా కోరుకునేది పొడువాటి జుట్టు, తెల్లటి చర్మం అందంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే అందంగా ఉండాలి అంటే జుట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది మన జుట్టు అందంగా ఉంటేనే మనం అందంగా కనిపిస్తూ ఉంటాం. జుట్టు నల్లగా, పొడవుగా ,ఒత్తుగా ఉండాలని అందరూ అనుకుంటారు. మన ముఖానికి ఎంతో అందాన్ని ఇచ్చే జుట్టు పెరగడానికి కొన్ని జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మన తలలో లక్ష నుండి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 January 2023,3:00 pm

Hair Tips : ఎవరైనా కోరుకునేది పొడువాటి జుట్టు, తెల్లటి చర్మం అందంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే అందంగా ఉండాలి అంటే జుట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది మన జుట్టు అందంగా ఉంటేనే మనం అందంగా కనిపిస్తూ ఉంటాం. జుట్టు నల్లగా, పొడవుగా ,ఒత్తుగా ఉండాలని అందరూ అనుకుంటారు. మన ముఖానికి ఎంతో అందాన్ని ఇచ్చే జుట్టు పెరగడానికి కొన్ని జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మన తలలో లక్ష నుండి లక్షన్నర వెంట్రుకల వరకు ఉంటాయి. చాలామంది కి జుట్టు ఒత్తుగా ఉంటుంది. కొందరులు జుట్టు పల్చగా ఉంటుంది. అలాగే వెంట్రుకల ఆకారం పొడవు తలపై వెంట్రుకల సంఖ్య ఇలా అన్నీ కూడా మన జీన్స్ పై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఒక వెంట్రుక 99 గ్రాముల బరువు వరకు మోయగలదు. వెంట్రుక కెరోటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతుంది ఈ ప్రోటీన్ నిర్మాణం ఎక్కువగా ఉండటం

వల్లనే వెంట్రుకకు అంత గట్టితనం ఏర్పడుతుంది. అయితే మనం చక్కటి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే జుట్టు కూడా అంత చక్కగా పెరుగుతూ ఉంటుంది. జుట్టు శుభ్రం చేసుకుంటూ ఉంటే ఒక్కసారి పుట్టిన వెంట్రుక ఐదు సంవత్సరాల వరకు ఊడిపోకుండా పెరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఉడిన వెంట్రుక ప్లేస్లో మళ్లీ కొత్త వెంట్రుకలు కూడా పుడుతూ ఉంటాయి. ఈ వెంట్రుక రావడానికి 20 రోజులు సమయం పడుతుంది. అయితే ఔషధ గుణాలు కలిగిన నూనెలు అప్లై చేసుకోవడం వల్ల ఈ కొత్త వెంట్రుకలు 15 రోజుల్లో మళ్ళీ మొలుస్తున్నాయి. ఊడిన వెంట్రుక ప్లేసులో 20 సార్లు కొత్త వెంట్రుకలు మొలుస్తున్నాయి. ఈ 20 సార్లు తర్వాత రాలిన వెంట్రుకల ప్లేస్ లో మళ్లీ వెంట్రుకలు రావు. అనారోగ్య సమస్యలు కారణంగా వెంట్రుకలు రాలినప్పటికీ మన జీవన విధానాన్ని మార్చుకోవడం వలన వాటి ప్లేసులో మళ్ళీ కొత్త జుట్టు వస్తుంది.

Hair Tips on Thinned hair is yours

Hair Tips on Thinned hair is yours

అదేవిధంగా రోజుకు 50 నుండి 150 వెంట్రుకలు సహజంగా ఉడిపోతూ ఉంటుంది. చాలామంది వెంట్రుకలు ఊడిపోతే 50 వెంట్రుకలు మళ్లీ వస్తాయి. ఇటువంటి వారు జుట్టు ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది. చాలామందిలో 100 వెంట్రుకలు రాలితే పోషకాహార లోపం ఇంప్లమేషన్ మూలంగా తిరిగి 50 వెంట్రుకలు మాత్రమే వస్తాయి. అదేవిధంగా రక్తహీనత, థైరాయిడ్ లాంటి సమస్యలు వలన జుట్టు ఊడిపోతూ ఉంటుంది.ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహారాలు శరీరంలో రక్తాన్ని పెంచే ఆహారాలు తీసుకోవడం సోయాబీన్స్, మిల్ మేకర్, ఆకుకూరలు, బాదంపప్పు ఎక్కువగా తీసుకోవడం వలన జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే మందార ఆకులను తీసుకొని వాటిని మెత్తని పేస్టులా చేసుకుని దాని అప్లై చేసుకోవడం వలన కూడా జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే బృంగరాజ్ ఆకుల తైలాన్ని కూడా అప్లై చేసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది