Hair Tips : జుట్టు సమస్యతో బాధపడేవారు ఈ 6 టెస్ట్ లను కచ్చితంగా చేయించుకోవాలి… లేకుంటే ఇక అంతే…!
Hair Tips : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు వారి యొక్క జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా షైనీగా కనిపించాలని కోరుకుంటారు. కానీ నేటి కాలంలో వాతావరణ మార్పుల వల్ల చాలామంది తీవ్రమైన హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం మార్కెట్లో లభించే ఎన్నెన్నో ప్రొడక్ట్స్ ని యూస్ చేస్తూ వస్తున్నారు. అయిన కూడా రిజల్ట్ పొందలేకపోతున్నారు. అయితే శరీరంలో కొన్ని పోషకాల లోపాలు ఉండడం వల్ల కూడా జుట్టు రాలుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన రక్తంలో కొన్ని విటమిన్స్ మరియు మినరల్స్ లోపించడం వలన జుట్టు రాలడంతో పాటు వ్యాధులు వస్తాయని , న్యూట్రిషనిస్ట్ , ఫిట్నెస్ నిపుణురాలు అయిన డాక్టర్ రీమా చెబుతున్నారు. ఒక వీటిని పరిష్కరించడం కోసం వాటి మూలాలను తెలుసుకోవడం చాలా అవసరమని అంటున్నారు. వీటిని తెలుసుకోవడానికి ఆరు రక్త పరీక్షలు సహాయపడతాయని ఆమె చెబుతున్నారు. ఇక అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
* సీబీసీ… సీబీసీ పరీక్ష లో ఎర్ర రక్త కణాలు మరియు తేల్ల రక్త కణాల హిమోగ్లోబిన్ మరియు ప్లేట్ సేల్స్ ను పరిశీలిస్తారు. వీటిలో ఏదైనా లోపం ఉంటే కచ్చితంగా జుట్టు రాలడం , క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుందట. *విటమిన్ డీ….. మన శరీరంలో విటమిన్ డి స్థాయిని గుర్తించడానికి విటమిన్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఆరోగ్య నియమాల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం శరీరంలో విటమిన్ డీ లోపముంటే జుట్టు రాలడం ఆస్టియోపొరసిస్ వంటి సమస్యలు వస్తాయట. ఆరోగ్యకరమైన ఎముకలు మరియు జుట్టు కావాలంటే విటమిన్ డి కచ్చితంగా అవసరం. *విటమిన్ బి 12 టెస్ట్ : మన శరీరంలో విటమిన్ బి 12 స్థాయిని , తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్ ను నిర్వహిస్తారు. ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి ఈ విటమిన్ చాలా అవసరం. విటమిన్ బి లోపం ఉంటే , ఎర్ర రక్త కణాలు మరియు హేమో గ్లోబీన్ లక్షణాలకు దారి తీస్తుందని ఎన్సిబీఐ సూచిస్తుంది.
*ఐరన్ ప్రొఫైల్ టెస్ట్… ఈ పరీక్ష ద్వారా రక్తంలో సీరం ఐరన్ మరియు ఫెర్రిటిన్ TIBC స్థాయిలను తెలుసుకోవచ్చు . రక్తంలో ఐరన్ లోపం ఉంటే బలహీనత, విపరీతమైన అలసట, తలనొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి . అలాగే శరీరంలో ఐరన్ సీరం స్థాయి తక్కువగా ఉంటే.. జుట్టు బలహీన పడుతుంది అని.. NCBI అధ్యాయనం లో తెలిసింది.
*థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్… ఈ టెస్ట్ ద్వారా T3 T4 TSH హార్మోన్స్ ను పరీక్షించవచ్చు. హార్మోన్స్ లో పెరుగుదల తగ్గుదల థైరాయిడ్ ను దిగజారుస్తుంది. దీంతో జుట్టు ఎక్కువగా రాలుతుంది.
*హార్మోన్ టెస్ట్.. హార్మోన్ లోపం అనేది జుట్టు రాలడంతో పాటు ఇతర వ్యాధులకు కూడా కారణం అవుతుంటాయి. మహిళలు ఆరోగ్యంగా ఉండడానికి ప్రో లాక్టిన్ , తెస్టో స్టెరాన్, FSH, LH , హార్మోన్ల పరీక్షలు చేయించుకోవడం మంచిదని డాక్టర్ రీమా చెబుతున్నారు.