Hair Tips : ఈ నూనె రాశారంటే… జుట్టు పలుచగా, ఒత్తుగా పెరుగుతుంది…
Hair Tips : ఈరోజుల్లో చాలామందికి జుట్టు రాలడం ఒక పెద్ద సమస్యగా తయారయింది. దీనికి కారణం మన దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, పనిలో ఒత్తిడి, ఆందోళన ఇలా పలు కారణాల వలన జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. దీనికోసం చాలామంది వేలవేల డబ్బులను వృధా చేస్తూ పార్లర్ చుట్టూ తిరుగుతారు. ఎంత ఖర్చు పెట్టినా సరే జుట్టులో ఎటువంటి మార్పు ఉండదు. అయితే ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే హెయిర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నూనెలో ఉపయోగించేటివి ప్రకృతిలో దొరికేటివి. కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ నూనెను చిన్నవారి నుంచి పెద్దవారు దాకా ప్రతి ఒక్కరు వాడవచ్చు.
ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 300 మి.లీ కొబ్బరి నూనెను తీసుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్ ను స్టవ్ పై పెట్టి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి అందులో ముందుగా ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత నాలుగు లవంగాలను వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఆ తర్వాత నాలుగు కొమ్మల తులసాకులను వేసుకోవాలి.
తర్వాత ఇందులో ఒక గుప్పెడు మందార ఆకులు, ఐదారు మందార పువ్వులను వేసుకోవాలి. తర్వాత ఎండు ఉసిరికాయ ముక్కలను ఒక గుప్పెడు వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు గరిక ఆకులు వేసుకొని మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. నూనె రంగు మారేంతవరకు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన నూనెను వేడిగా ఉండగానే వేరే బౌల్లోకి వడగట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను రోజు తలకు కుదుళ్ళ నుంచి చివర్ల దాకా పట్టించాలి. ఇలా చేయడం ద్వారా వారం రోజుల్లోనే కొత్త జుట్టు రావడం మొదలవుతుంది. వారానికి రెండు రోజులు ఏదైనా షాంపూ తో తలస్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు బలంగా, పొడవుగా పెరుగుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక దీనిని అన్ని వయసులవారు ట్రై చేయవచ్చు.