Hair Tips : ఈ ఆకు పొడిలో చిటికెడు ఉప్పు కలిపి రాశారంటే… తెల్ల వెంట్రుకలు నల్లగా మారిపోతాయి…
Hair Tips : ఈ రోజుల్లో చాలామందికి చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. చాలామంది తెల్ల వెంట్రుకలు ఉండడం వలన బయటకు వెళ్లాలంటే ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి వాటిని దాచిపెట్టడం కోసం రకరకాల హెయిర్ కలర్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా వివిధ రకాల ట్రీట్మెంట్లను తీసుకుంటారు. అయినా జుట్టులో ఎటువంటి మార్పు ఉండదు. వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వేలవేల డబ్బులను వృధా చేసే బదులు నాచురల్ పద్ధతిలో తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవచ్చు. ఈ పద్ధతి లో కనుక జుట్టును సులువుగా నల్లగా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని రెండు చెంచాలు టీ పొడిని వేసుకొని డికాషన్ లాగా బాగా మరగనివ్వాలి. తర్వాత మరొక గిన్నెలోకి డికాషన్ను వడపోసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఇనుప కడాయి పెట్టుకొని దానిలో హెన్నా పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ ను డికాషన్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి బాగా కలుపుకోవాలి. డికాషన్ సరిపోకపోతే కొంచెం వేడి నీళ్లు కూడా పోసుకొని ప్యాక్ లాగా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి. తర్వాత దీనిపై మూత పెట్టి రాత్రంతా అలాగే వదిలేయాలి. ప్రొద్దున్నే లేచిన వెంటనే ఈ మిశ్రమాన్ని తల మొత్తం రాసుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేసిన వెంటనే సెకండ్ స్టెప్ కోసం కావాల్సింది తయారు చేసుకోవాలి.
దీనికోసం ఒక గిన్నె తీసుకొని మీ జుట్టుకు సరిపడినంత ఇండిగో పౌడర్ ను వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఇండిగో పౌడర్ ను కూడా గోరువెచ్చని నీళ్లతో హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి. మనం ముందుగా హెన్నా అప్లై చేసిన తర్వాత దానిమీద ఇండిగో పేస్ట్ ను కూడా అప్లై చేసి 45 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత మామూలు వాటర్ తో తలస్నానం చేయాలి. షాంపూ ఉపయోగించకూడదు. ఇలా చేయడం వలన తెల్ల వెంట్రుకలు మొత్తం నల్లగా మారుతాయి. ఈ హెయిర్ కలర్ వారం లేదా పది రోజులు మాత్రమే ఉంటుంది. వారానికి ఒకసారి వేసుకుంటూ ఉండాలి. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఎలాంటి వయసు వారైనా వేసుకోవచ్చు.