Hair Tips : బట్టతల ఉన్నవారు ఈ నూనె రాశారంటే… వారంలో జుట్టు మొలుస్తుంది…
Hair Tips : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంది. జుట్టు రాలే సమస్యల వలన కొందరికి జుట్టు పల్చబడటం, కొందరికి బట్టతల రావటం వంటివి జరుగుతున్నాయి. జుట్టు రాలే సమస్య డ్రగ్స్ తీసుకోవడం, మద్యపానం సేవించడం వలన కూడా ఎక్కువ అవుతుంది. తల స్నానం చేసినప్పుడు లేదా దువ్వినప్పుడు 200 కంటే ఎక్కువ వెంట్రుకలు ఊడితే జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉంది అని అర్థం. రక్తహీనత జుట్టుకుదుర్ల దగ్గర రంధ్రాలు కూరుకుపోవడం వంటి వాటి వలన జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. కొందరికి విటమిన్స్ లోపం, అనారోగ్యాలు, ఒత్తిడి, హార్మోన్ సమతుల్యత వంటి వాటి వల్ల కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది.
జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ను ఉపయోగించే అవసరం లేకుండా ఇంట్లోనే కొన్ని వాటితో ఈజీగా జుట్టు రాలడం సమస్యను తగ్గించుకోవచ్చు. దీనివల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీనికోసం ముందుగా మూడు లేదా నాలుగు అంగుళాల అల్లం ముక్కలు తీసుకొని మెత్తగా తురుముకోవాలి. తర్వాత కొన్ని లవంగాలను తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. లవంగాలను ఒకేసారి ఎక్కువగా పొడి చేసుకొని గాలి చొరబడని కంటైనర్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో మనం ముందుగా తురుముకున్న అల్లం వేసుకోవాలి.
తర్వాత రెండు స్పూన్ల లవంగాల పొడిని వేసుకోవాలి. తర్వాత అర కప్పు ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టౌ పై పెట్టి తక్కువ మంట లో నూనెను కలుపుతూ 5 పది నిమిషాల పాటు మరిగించుకోవాలి. చల్లారిన తర్వాత ఏదైనా క్లాత్ తీసుకొని నూనెను వడకట్టుకోవాలి. ఈ నూనె ఏదైనా సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకుంటే ఈ నూనెను నెల రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. తర్వాత ఈ నూనె ఏదైనా కాటన్ లేదా చేతితో తలకు అప్లై చేసి కవర్తో కవర్ చేయాలి. గంట సేపు అలా ఉండి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే బట్టతల ఉన్నవారికి జుట్టు పెరుగుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.