Health Benefits : వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలకు చెక్ పెట్టాల్సిందే…
Health Benefits : వర్షాకాలంలో వర్షాలు బాగా కురుస్తుంటాయి అయితే వాతావరణం మార్పుల వల్ల ఎన్నో రోగాలు సోకుతుంటాయి అలాగే కలుషితమైన నీరు కారణంగా ఎన్నో జబ్బుల బారిన పడుతుంటారు ఈ సీజన్లో జలుబు, దగ్గు, గ్యాస్, ఎసిడిటీ, అధిక బరువు పెరిగిపోవడం ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వ్యాధులు అన్నిటికి కారణాలు వాతావరణం మార్పులే కాదు మనం తీసుకునే ఆహార పదార్థాల మార్పులు కూడా చాలామంది బయట ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అలాగే ఎక్కువ నూనెలో చేసే ఫుడ్ కూడా తీసుకుంటుంటారు ఇలా తీసుకోవడం వలన ఎన్నో వ్యాధుల బారిన పడుతుంటారు అని చెప్తున్నారు.
నిపుణులు ఇలాంటి వాటి భారిన పడకుండా ఉండాలంటే ఈ సీజన్లో ఎటువంటి పదార్థాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం. చాలామంది పాలు పెరుగులు తీసుకోకుండా ఉండలేరు. అయితే ఇవి తీసుకోవడం వలన ఎన్నో వ్యాధులు చుట్టూముడుతున్నాయి ఎందుకనగా పశువుల మేసే గ్రాసంలో ఎన్నో కీటకాల అలాగే దోమలు విసర్జన చేస్తూ ఉంటాయి దాని ప్రభావం పాలపై చూపుతుంది అని చెప్తున్నారు నిపుణులు అలాగే స్వీట్స్ ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి వీటి వలన ఈ సీజన్లో తొందరగా జలుబులు బారిన పడుతుంటారు. అలాగే మాంసాలు ఈ సీజన్లో మాంసాహారాలు కు దూరంగా ఉండాలి.
ఎందుకనగా వాతావరణం తేమ వలన వీటిలో తొందరగా బ్యాక్టీరియా వేరుపడుతుంది అందువలన ఈ సీజన్లో వీటిని తీసుకోపోవడమే మంచిది. అలాగే బెండకాయలు క్యాబేజీ ఇలా కొన్ని కూరగాయలలో ఎక్కువ క్రిములు పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండాలి. ఆకుకూరలు ఈ సీజన్లో ఆకుకూరలలో పై పెద్దపెద్ద పురుగులు క్రీములు పేరుకుపోతూ ఉంటాయి. అటువంటి సమయంలో వీటిని సరియైన పద్ధతిలో శుభ్రం పరచుకోకుండా తినడం వల్ల ఇలాంటి వ్యాధులు బారిన పడుతుంటారు అందువలన ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది అని చెప్తున్నారు నిపుణులు ఈ సీజన్లో ఆహార పదార్థాలు వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకోవడం వలన మంచి లాభాలు ఉంటాయి.