Health Benefits : వీటిని ఫిల్టర్ చేసి రోజూ తాగితే.. కిడ్నీలు క్లీన్ అయిపోతాయి.. అవేంటో తెలుసా?
Health Benefits : చాలా మంది ప్రతిరోజూ ఉదయం లేవగానే రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకు నీళ్లను తాగుతుంటారు. దీని వల్ల శరీరం అంతా డీటాక్స్ అవుతుంది. అయితే ఈ నీటిని మొత్తాన్ని ఒకేసారి కాకుండా రెండు సార్లు లేదా పావు లీటర్ చొప్పున నాలుగైదు సార్లు తాగితే.. మోషన్ ఫ్రీ అవుతుంది. పొట్ట కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. అయితే రోజూ ఉదయం నీళ్లు తాగానే వేరేవి తాగడం వంటివి చేయాలి. తర్వాత 9 నుంచి తొమ్మిదిన్నర వరకు జ్యూస్ తాగాలి. రోజంతా ఎక్కువగా లిక్విడ్స్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి. దీని వల్ల యూరిన్ ఎక్కువగా అయ్యి కిడ్నీలు క్లీన్ అవుతాయి. జ్యూస్ లలో ఎక్కువగా సొర కాయ, కర్భూజ, బీట్ రాట్ వంటి ఆరోగ్యానికి చాలా మంచివి.
వీటన్నిటిలో మినరల్స్, నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ తక్కువ సమయంలో ఎక్కువ ఫిల్టర్ చేస్తాయి. అలిసిపోకుండా కిడ్నీలు ఫిల్టర్ చేయడంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న జ్యూస్ లు సాయపడతాయి. అందుకే రోజూ ఉదయం ఇలాంటి జ్యూస్ తప్పనిసరిగా తాగాలి. కేవలం ఒకే ఒక్క రోజు కాకుండా ప్రతిరోజూ తీసుకోవాలి. 11 గంటల సమయంలో బార్లీ నీళ్లు తాగాలి. మధ్యాహ్నం భోజనంలో పండ్లు మాత్రమే తీసుకోవాలి. పండ్లు తీసుకోవడం వల్ల లవణాలు మన శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే అందుతాయి. అయితే మనం అన్నం, కూరలు తీసుకోవడం వల్ల మన నోటికి రుచిగా ఉండటం కోసం ఉప్పు, కారం ఎక్కువగా తీసుకుంటే దీని వల్ల నష్టమే తప్ప ఉపయోగం ఉండదు.

Health Benefits blood purification improves kidney filtaration
నాచురల్ ఆహారంలో ఉండే ఎక్కువ అయిన లవణాలు బయటకి పంపే శక్తి కిడ్నీలకు ఉండదు.మధ్యాహ్నం ఆహారంలో ఉప్పు లేకుండా మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఫిల్టర్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. కిడ్నీల్లో ఇన్ ఫ్లమేషన్ రాకుండా అరికడతాయి. పండ్లలో ద్రాక్ష పండ్లు తప్పనిసరిగా ఉండాలి. నాలుగున్నర ఐదు గంటల వరకు నీళ్లు తాగుతూనే ఉండాలి. ఐదు గంటలకు కొబ్బరి నీళ్లు తాగాలి. దీని వల్ల యూరిన్ ఎక్కువ మొత్తంలో వస్తూ.. కిడ్నీలు క్లీన్ అయిపోతాయి. కిడ్నీలను పాడు చేసుకొని ప్రతిరోజూ డయాలసిస్ చేయించుకోవడం కంటే ముందుగానే ఈ చిట్కాలను పాటించి కడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవడం మంచిది.